రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్‌కు సన్మానం


Mon,February 19, 2018 12:03 AM

గద్వాల,నమసే ్తతెలంగాణ : జిల్లా కేంద్రానికి చెందిన డాక్టర్ శివప్రసాద్ రాష్ట్ర వైద్యవిధాన పరిషత్ కమిషనర్‌గా ఎంపికై మొదటిసారి గద్వాలకు వచ్చిన సందర్భంగా ఆదివారం బీసీ సంక్షేమ, ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో హరిత హోటల్‌లో ఘనంగా సన్మానించారు. బీసీ సంఘం నాయకులు మధుసూధన్‌బాబు, సతీష్‌కుమార్‌లు మాట్లాడుతూ.. గద్వాల పట్టణానికి చెందిన వ్యక్తి రాష్ట్రస్థాయి వైద్యరంగంలో మంచి పదవిలో ఉండడం జిల్లాకే గర్వకారణమని వారు కొనియాడారు. గద్వాల దవాఖాన కు అవసరమైన వైద్యుల పోస్టులు మంజూరు చేసి పేదలకు మంచి వైద్యం అందేలా చూడాలని సంఘం నాయకులు కోరారు. సన్మానించిన వారిలో బీసీ సంఘం నేతలు డాక్టర్ నరసింగరావు , జమ్మిచేడ్ సతీష్ , బీకే వెంకటేష్ ,శ్రీధర్, కృష్ణయ్య, సుదర్శన్, బాబునాయిడు తదితరులు ఉన్నారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...