ప్రత్యేక పంచాయతీకోసం వినతి


Mon,February 19, 2018 12:03 AM

ఉండవెల్లి : మండలంలోని మారమునగాల 1, 2గ్రామపంచాయతీలను ప్రత్యేక గ్రామాలుగా గుర్తిం చాలని సర్పంచ్ ఈరన్నగౌడ్, టీఆర్‌ఎస్ నాయకులు హైదరాబాద్‌లో మంత్రులను కలిసి వినతి పత్రాలను అందజేశారు. ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి, రెవెన్యూశాఖ మంత్రి ఈటెల రాజేందర్, అలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ను కలిసి ప్రత్యేక పంచాయతీ ఏర్పాటు అర్హతలను వివరించారు. అనంతరం వారు మాట్లాడుతూ స్వాంత్రతం వచ్చి ఏడు దశబ్దాలు అవుతున్న గత ప్రభుత్వాలు శ్రీశైలం ముంపు గ్రామమైన మారమునగాల 1, 2గ్రామాల్లో మౌలిక వసతులను కల్పించలేదు. దీంతో రెండు గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి లేక ప్రజలు వలస వెళ్లి పట్టణ ప్రాంతాలలో జీవనం సాగించేవారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వా త ప్రభుత్వం రెండు గ్రామాల్లో అధిక నిధులు కేటాయించి సీసీరోడ్డు, ఓవర్‌హెడ్‌ట్యాంక్ నిర్మాణం చేపట్టారు. రెండు గ్రామాలు పంచాయతీలుగా ఏర్పడటంతో ప్రభుత్వ కార్యాలయాలు, నిధులు కేటాయింపు, అభివృద్ధ్ది జరిగే అవకాశం ఉందని గ్రామస్తులు అశాభావం వ్యక్తం చేశారు.

మంత్రులహామీతో సంబరాలు ..
ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి, రెవెన్యూశాఖ మంత్రి ఈటెల రాజేందర్, అలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో టీఆర్‌ఎస్ కార్యకర్తలు, గ్రామస్తులు స్వీట్‌లు పంచుకోని సంబరాలు చేసుకున్నారు. రెండు గ్రామపంచాయతీ ఏర్పాటుకు కృషిచేస్తున్న మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు.

84
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...