గ్రామీణ రోడ్లకు మహర్దశ


Mon,February 19, 2018 12:02 AM

వడ్డేపల్లి : తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గ్రామాల రూపురేఖలు మారిపోతున్నాయి. గ్రామాల్లో సీసీ రోడ్లు, తాగునీటి ట్యాంక్‌లు, పంచాయతీ భవనాలు, మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు, విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు, 24 గంటల కరెంట్, ఫాంపాండ్స్, మిషన్ భగీరథ పనులు, బావుల పూడిక తీతలు తదితర ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఏళ్ల తరబడి నిర్లక్ష్యానికి గురై ఉన్న గ్రామాల్లోని రోడ్లను మరమ్మతులు చేసి సీసీ రోడ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. గత సంవత్సరం 65 సీసీ రోడ్ల నిర్మాణాలకు రూ.3 కోట్ల 25 లక్షలు ఖర్చు చేశామని పీఆర్ ఏఈ కబీర్ దాస్ అన్నారు. ఈ సంవత్సరం ఎన్‌ఆర్‌ఈజీఎస్, సీడీపీ, పంచాయతీ నిధుల నుంచి 74 పనులకు రూ.3 కోట్ల 73 లక్షల నిధులు మంజూరైందని అన్నారు.

సీసీరోడ్ల వివరాలు..
వడ్డేపల్లి 20 పనులకు 1 కోటి, పైపాడు ఆరు పనులకు 25 లక్షలా 50 వేలు , జూలేకల్‌లో ఏడు పనులకు 35 లక్షలు, కొంకలలో నాలుగు పనులకు 20 లక్షలు, తనగలలో ఒక పనికి రూ. 5 లక్షలు, రామాపురంలో రెండు పనులకు 10 లక్షలు, తూర్పు గార్లపాడులో 2 పను లకు రూ.10 లక్షలు, పెద్దధన్వాడలో 3 పనులకు 15 లక్షలు, నసనూరులో 3 పనులకు 15 లక్షలు, మాన్‌దొడ్డిలో 4 పనులకు 20 లక్షలు, పచ్చర్లలో 2 పనులకు 10 లక్షలు, తుమ్మిళ్లలో 4 పనులకు 20 లక్షలు, పెద్దతాండ్రపాడులో 4 పనులకు 20 లక్షలు, ముండ్లదిన్నెలో 1 పనికి 5 లక్షలు, తుమ్మిళ్లలో కొత్త కాలనీలో అంతర్గత రోడ్లకు, సోలార్ లైట్లకు రూ.20 లక్షలు, రాజోళిలో 30 లక్షలు మంజూరైనాయని ఏఈ తెలిపారు.

134
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...