వేటు


Sun,February 18, 2018 01:14 AM

-భర్త ఉండగానే వితంతు పింఛన్లు
-ధరూర్ మండలం మన్నాపురంలో అక్రమాలు
-పంచాయతీ సెక్రటరీపై సస్పెన్షన్ వేటు
-జిల్లాదాటివెళ్లొద్దని ఆదేశాలు
-అక్రమార్కుల్లో మొదలైన వణుకు
పాలమూరు యూనివర్సిటీ : సంత్ సేవాలాల్ మహరాజ్‌ను ఆదర్శంగా తీసుకొని, ఆయన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్ అన్నారు. పాలమూరు విశ్వవిద్యాలయంలో శనివారం సంత్ సేవాలాల్ మహరాజ్ 279వ జయంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ ఫ్రొఫెసర్ సీతారాం నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజనులు 11వ శతాబ్దం నుంచి గుర్తించబడ్డారని, అప్పటి నుంచి బ్రిటీష్ కాలంలోనే వారి సైన్యానికి ఆవుల ద్వారా సహకారం అందించిన ఘనత ఉందని అన్నారు. గిరిజనుల కుల గురువులే దేవుళ్లు అని అన్నారు. ఎస్సీ,ఎస్టీ, బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. గిరిజనులు అంటే అడవులలో నివాసం ఉంటూ, సమాజానికి దూరంగా ఉంటూ ఒక సమూహంగా గుట్టలపై నివాసాలను ఏర్పాటు చేసుకొని నివసిస్తారన్నారు.

కానీ అప్పట్లో గిరిజనుల భాషకు లిపిలేదని, లాంబాడీల భాషను వారు మాత్రమే మట్లాడు కోగలరని అన్నారు. సంత్ సేవాలాల్ మహరాజ్ లంబాడీల కోసం జీవితాన్ని త్యాగం చేసిన ఘనత అయనకుందన్నారు. ఆంధ్రప్రదే శ్‌లోని అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని కావ్వకుడా తండాలో అయన జన్మించారని, అక్కడ ఇప్పటికీ ఆయన జయంతిని ఒక పండుగలగా జరుపుకుంటారన్నారు. జ్ఞానం ఎవరి సొత్తు కాదని, అందరిలోనూ ఉంటుందని, కష్టపడి చదివితేనే వస్తుందన్నారు. ప్రతి విద్యార్థి జీవితంలో ఒక లక్ష్యాన్ని పెట్టుకొని చదవాలన్నారు. చదువు ఉంటేనే అన్ని సాధ్యమవుతాయని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కూడా ముందుండి పోరాటం చేసినందుకే ప్రజలు మనకు ఈ అవకాశం ఇచ్చారని గుర్తుచేశారు.

ఇప్పటికీ గిరిజనులు సంప్రదాయాలు తెలియకుండా తిండికి, బట్టకు లేకుండా జీవితం గడుపుతున్నారని గుర్తు చేశారు. 279 సంవత్సరాల కిందట జరిగిన విషయాలను గుర్తించుకొని, కుల గురువులను గుర్తుచేసుకొని సంబురాలు చేస్తున్నామని అన్నారు. వీసీ రాజారత్నం మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో పాలమూరు విశ్వవిద్యాలయం అన్ని రంగాలలో ముందుండేలా కృషి చేస్తున్నామని, ఇక్కడ చదివే ప్రతి విద్యార్థి జీవితంలో ఒక మంచి స్థానానికి వెళ్లాలని సూచించారు.

ప్రభుత్వం కూడా ఉన్నత విద్యకు ఎక్కువ అవకాశాలను ఇస్తుందని వాటిని ఉపయోగించుకొని అన్ని విధాలుగా విద్యార్థులు ఎదిగార న్నారు. తమ జాతి వృక్షాన్ని అభివృద్థి చెందేలా కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో సీటీవో రాంచందర్ నాయక్, లక్ష్మణ్ నాయక్, చంద్రానాయక్, రవిరాథోడ్, ప్రిన్సిపాల్ డాక్టర్ జైపాల్‌రెడ్డి, ప్రిన్సిపాల్ ప్రభాకర్‌రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ కుమారస్వామి, డీన్ పవన్‌కుమార్, ఓఎస్‌డీ మధుసూధన్‌రెడ్డి, లెక్చరర్లు మనోజ, గిరిజ, అరుణ్, తదితరులు పాల్గొన్నారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...