అభివృద్ధిలో రాష్ట్రం కొత్తపుంతలు


Sun,February 18, 2018 01:08 AM

-ప్రభుత్వ పథకాలపై కనకయ్య విస్తృత ప్రచారం
-మోటర్ సైకిల్ యాత్రతో రాష్ట్రమంతా పర్యటన
-గద్వాల జిల్లాలో పర్యటించిన సింగరేణి మాజీ ఉద్యోగి
గద్వాల, నమస్తే తెలంగాణ/ ఇటిక్యాల : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పలు సంక్షేమ, అభివృద్ధి పథకాలతో కొంతపుంతలు తొక్కుతోందని భద్రాది కొత్తగూడెం జిల్లాకు చెందిన చింతల కనకయ్య అన్నారు. సింగరేణి ఉద్యోగిగా ఉద్యోగ విరమణ చేసిన కనకయ్య ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై విస్త్రృత ప్రచారం చేస్తున్నారు. జనవరి 18న కొత్తగూడెంలో ప్రారంభమైన కనకయ్య మోటర్‌సైకిల్ యాత్ర శనివారం జోగుళాంబ గద్వాల జిల్లాకు చేరుకున్నారు. మోటర్ సైకిల్ యాత్రకు టీఆర్‌ఎస్ నాయకులు వంశీ తదితరులు స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా కనకయ్య నమస్తే తెలంగాణతో మాట్లాడారు. తాను చేపట్టిన యాత్ర గద్వాల జిల్లాతో 24 జిల్లాలు పూర్తి చేశానని చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రజలకు మరింత అవగాహన కల్పించడానికి ఈయాత్ర చేపట్టినట్లు చెప్పారు. రాష్ట్రంలో సబ్బండ వర్గాల అభివృద్ధికి ముఖ్యమంత్రి చేపడుతున్న పథకాలను ప్రజలకు వినూత్నంగా తెలియపర్చేందుకే ఈబైక్ ర్యాలీ చేపట్టానని తెలిపారు. త్వరలోనే 7జిల్లాల పర్యటనను పూర్తి చేసుకొని రాష్ట్ర రాజధానిలోని తెలంగాణ భవన్‌లో ముగింపు సభను నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...