తెలంగాణ జాతి పిత సీఎం కేసీఅర్


Sun,February 18, 2018 01:08 AM

గద్వాల అర్బన్ : సీఎం కేసీఆర్ తెలంగాణ జాతి పిత అని టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని టీఆర్‌ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. సీఎం కే.చంద్రశేఖర్‌రావు జన్మదిన వేడుకలను గద్వాల టౌన్‌తో పాటు ఆయా మండలలో కూడా చాలా ఘనంగా నిర్వహించామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధి పనులు దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్టంలో కేసీఆర్ అమలు చేస్తున్నారన్నారు. దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ఎంతో కృషి చేశారన్నారు. ఆయన కృషి వల్లే హర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. బడుగు,బలహీన వర్గల ప్రజలకు నేను ఉన్నానంటూ మంచి సంక్షేమ పథకాలను అమలు పరిచారన్నారు.

సంక్షేమ పథకాలన్నీ సంపూర్ణంగా, పారదర్శకంగా అమలవుతున్నాయన్నారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక గద్వాల జిల్లా కూడా అభివృద్ధిలో ముందుంద న్నారు. జిల్లాపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని అన్నారు. జిల్లాలోని ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు పూర్తయ్యాయన్నారు. ఆయన చేస్తున్న అభివృధ్ధి పనులే 2019 ఎన్నికల్లో ప్రజలు అత్యధిక ఓట్లు వేసి గెలిపిస్తారని అభిపారయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ బీఎస్ కేశవ్, ఎంపీపీ సుభాన్, నాయకులు విజయ్ కుమార్, రఘువర్ధన్ రెడ్డి, వెంకట్‌రెడ్డి పాలొన్నారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...