ఆరోగ్య తెలంగాణకు.. సర్కారు భరోస


Sat,February 17, 2018 01:04 AM

గద్వాల, నమస్తే తెలంగాణ :తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ వైద్యం తీరు పూర్తిగా మారింది. ప్రభుత్వ దవాఖానలు ఎంతో మెరుగుపడ్డాయి. కేసీఆర్ కిట్స్ పథకం రాష్ట్రంలో అద్భుతంగా అమలు అవుతుండడంతో నిరుపేద గర్భిణులు కాన్పు కోసం ప్రభుత్వ దవాఖానల వైపు మల్లుతున్నారు. వైద్యాధికారులు కూడా సదాశయంతో పని చేస్తుండడంతో ప్రసుత్తం గ్రామ, పట్టణాలలో మలేరియా, డెంగీ కారక మరణాలు చాలా వరకు తగ్గినట్లు వైద్యుల ద్వారా తెలుస్తున్నది. ప్రస్తుతం ప్రభుత్వ దవాఖానలో రోగులు చికిత్స పొందిన రోగ నిర్ధారణ పరీక్షలకు ప్రైవేట్ కేంద్రాలను ఆశ్రయించాల్సి వచ్చేది. దీంతో నిరుపేద రోగులకు ఇది భారమయ్యేది. ప్రైవేట్ క్లీనిక్‌లకు వెళితే అడ్డగోలు పరీక్షలు చేసి, డబ్బులు దండుకొనేవారు. డబ్బుల్లేనివారు రోగనిర్ధారణ పరీక్షలు చేయించుకోలేక ప్రాణాల మీదికి తెచ్చుకునేవారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించి వారికి ఉచిత నిర్ధారణ పరీక్షలు చేయడానికి టీ-డయాగ్నోస్టిక్స్ పేరిట కొత్త పథకం ప్రవేశ పెట్టింది. దీంతో ప్రతి ఒక్కరికీ ఉచిత రోగనిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నారు.

ఇందుకు ఎంత ఖర్చయినా భరిస్తామని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రకటించడంతో పేదలకు బతుకు పై ఆశ పెరిగింది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్‌దేన్ క్యూర్ అనే మాటను తెలంగాణ ప్రభుత్వం ఆచరణలో పెట్టి గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని ప్రజలందరికీ ప్రభుత్వ ఖర్చుతో రోగనిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నారు. అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రతి ఒక్కరూ ఎప్పటికప్పుడు రోగనిర్ధారణ పరీక్షలు చేయించుకుంటారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రతి ఒక్కరికీ అలాంటి ఆరోగ్య అవగాహన అలవాటు చేయించాలనేది దీని లక్ష్యం.
ప్రసుత్తం రోగాలపై అవగాహన ఉన్న వారు, ఆర్థిక స్తోమత కలిగిన వారు పరీక్షలు చేయించుకుంటున్నారు. కానీ, గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలు రోగం వచ్చినప్పుడు తప్ప దవాఖానలకు వెళ్లరు. వైద్యపరీక్షలు చేయించుకోరు. దీని వల్ల వ్యాధులను ప్రాథమిక స్థాయిలో గుర్తించలేకపోతున్నారు.

దీంతో రోగం ముదిరిన తర్వాత దవాఖానలకు వస్తే ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. ఇది గ్రహించిన ముఖ్యమంత్రి ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరికీ ప్రభుత్వమే క్రమం తప్పకుండా వైద్యపరీక్షలు నిర్వహించి వారి రక్తనమూనాలు సేకరించి అన్ని రకాల రోగ నిర్ధారణ పరీక్షలు చేయించడానికి చర్యలు తీసుకుంటున్నది. మారుమూల ప్రాంతాల నిరుపేదల ముంగిట్లో ప్రభుత్వ వైద్యం అందిచడమే సర్కారు లక్ష్యంగా ముందుకు సాగుతుంది. సుమారు 53రకాల రక్త పరీక్షలు చేయడానికి ప్రభుత్వం పూనుకున్నట్లు తెలిసింది. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం పట్ల గ్రామీణ ప్రజలు హర్షం వెల్లబుచ్చుతున్నారు.

161
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...