మరణం లేని వీరుడు

Wed,January 24, 2018 01:15 AM

అలంపూర్,నమస్తే తెలంగాణ : దేశ స్వాతంత్య్ర పోరాటంలో ఎందరో మహానుభావులు ఉద్యమ పోరాటంలో అసువులు బాసిన విషయం తెలిసిందే, అయితే స్వాతంత్య్ర పోరాటంలో మరణంలేని వీరుడిగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ నే చెప్పుకోవచ్చని, ఆయనకు పుట్టిన రోజు ఉందే గానీ మరణించిన రోజును నేటికి ఎవరూ నిర్ధారించలేదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. అలంపూర్ పట్టణంలో నేతాజీ ఫ్రెండ్ చైతన్య సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన నేతాజీ జయ ంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా సింగిరెడ్డికి బాణా సంచాతో విద్యార్థుల మార్చ్ ఫాస్ట్‌తో కాలనీ వాసులు స్వాగతం పలికారు. నేతాజీ విగ్రహం వద్దకు చేరుకుని పూలమాలలు వేసి నివాళు లర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఆంగ్లేయుల పాలనలో భారతీయులు బానిసత్వానికి గురౌ తున్న విషయాన్ని గుర్తించిన నేతాజీ తాను చేస్తున్న ఉద్యోగాలను వదులుకుని స్వాతంత్య్ర పోరాటంలో యువతకు బాసటగా నిలిచార న్నారు. అద్భుత భావితర నిర్మాణం కోసం యువకులను ఉత్తేజం చేస్తూ పోరాటాన్ని ముందుకు నడిపిన మహోన్నత వ్యక్తి నేతాజీ అని కొనియాడారు.

అనంతరం మందా జగన్నాథం ఎందరో నాయకులు ఉన్నప్పటికీ ఆయన ప్రత్యేకమైన సిద్ధాంతాన్ని ఎంచుకొని స్వాతంత్య్ర పోరాటంలో కీలక పాత్ర పోషించారన్నారు. అనంతరం 20 మంది కవులను సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విద్యార్థుల విన్యాసాలు, వేషధారణలు, నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఎమ్మెల్యే సంపత్ కుమార్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేశవ్, సర్పంచ్ జయ రాముడు, టీర్‌ఎస్ పార్టీ నియోజక వర్గ ఇన్‌చార్జి మంద శ్రీనాథ్, వ్వవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విష్ణువర్దన్ రెడ్డి, జడ్పీటీసీ సూర్యబాబు గౌడ్, మాజీ ఎంపీపీ సుదర్శన్‌గౌడు, ఎంఈవో అశోక్‌కుమార్, నారాయణరెడ్డి, నేతాజీ ఫ్రెండ్స్ చైతన్చ సమితి అధ్యక్ష కార్యదర్శులు ఆనంద శర్మ, వెంకట్రామయ్య శెట్టి, ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్, పాల్గొన్నారు.
నేతాజీ అడుగు జాడల్లో నడుద్దాం

బీసీ కమిషన్ సభ్యుడు అంజనేయిలుగౌడు
స్వాతంత్య్రం కోసం పోరాడిన మహనీయుల్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని, ఆయన అడుగు జాడల్లో అందరం నడిచి భారతజాతి ఔన్నత్యం కోసం అందరం కృషి చేద్దామని బీసీ కమిషన్ సభ్యుడు ఆంజనేయిలుగౌడ్ అన్నారు. నేతాజీ సుభాష్ చంద్ర బోస్ 121వ జయంతి వేడుకల్లో భాగంగా జిల్లా కేంద్రం రాజీవ్ మార్గ్‌లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళ్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో గణేష్, చక్రధర్, వెంకటేష్, తిరుమల్, పవన్, రవిందర్‌గౌడ్ పాల్గొన్నారు.

95
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles