సుభాష్ చంద్రబోస్ భావాలు భిన్నమైనవి

Wed,January 24, 2018 01:15 AM

గట్టు /గద్వాల టౌన్/ అర్బన్/ ధరూర్ : స్వాతంత్య్ర ఉద్యమంలో పోరాడిన గొప్ప యోధుడు సుభాస్ చంద్రబోస్ అని జడ్పీటీసీ బాసు శ్యామల, తహసీల్దార్ సుందర్‌రాజు పేర్కొన్నారు. గట్టు మండల కేంద్రం గట్టులో నేతాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో నేతాజీ 121వ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు, అధికారులు, యువజన సంఘం సభ్యులు నేతాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మండలంలోని పెంచికలపాడు యూపీఎస్‌లో సుభాస్ చంద్రబోస్ జయంతిని బాలల సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. నేటి యువత నేతాజీ సుభాస్ చంద్రబోస్‌ను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షడు బస్సన్న పేర్కొన్నారు. గద్వాల పట్టణంలో టీఅర్‌ఎస్వీ నాయకులు మైబుబ్, వంశీ, పవన్, అన్సర్, లక్కీరెడ్డి ఆధ్వర్యంలో, బీజేపీ పట్టణ అధ్యక్షుడు ఎక్బోటే రవి, ఏబీవీపీ ఆధ్వర్యంలో, అలాగే ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఉపాధ్యాయుల సమక్షంలో ఆయన జయంతి వేడుకలు జరిగాయి. ధరూర్ మండల కేంద్రంలోని బీసీ బాలుర వసతి గృహ విద్యార్థులకు వార్డెన్ నర్సింహ వివరించారు.

135
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles