మరుగుదొడ్ల నిర్మాణాలను పూర్తి చేసుకోవాలి


Wed,January 24, 2018 01:14 AM

అయిజ రూరల్ : స్వచ్ఛభారత్‌లో భాగంగా మండలంలో నిర్మాణంలో ఉన్న వ్యక్తిగత మరుగుదొడ్లను వీలైనంత త్వరగా పూర్తి చేసుకోవాలని ఎంపీడీవో నాగేంద్ర పేర్కొన్నారు. మంగళవారం మండల పరిధిలోని వేణిసోంపురం గ్రామంలో పల్లెవికాసం కార్యక్రమం అధికారులు నిర్వహించారు. కార్యక్రమా నికి హాజరైన ఎంపీడీవో వివిధ శాఖల అధికారులతో కలిసి గ్రామంలో పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామస్తులతో సామవేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను వెంటనే పూర్తి చేసుకొ ని ప్రభుత్వం అందించే రాయితీని పొందాలని సూచించారు. పరిసరాల పరిశుభ్రతలో మరుగుదొడ్ల ఆవశ్యకత ఉందని తెలిపారు. మరుగుదొడ్డితోపాటు ఇంకుడుగుంత నిర్మించుకొని స్వచ్ఛగ్రామాలుగా గుర్తింపు పొందాలని సూచించారు. మరుగుదొడ్ల నిర్మాణంలో వివిధ శాఖల అధికారులతో వార్డు మెంబరు, సర్పంచ్ సహకరించాలని కోరారు. అనంతరం మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్న వారికి చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ పార్వతి శివన్న, గ్రామ పెద్దలు, ఫీల్డ్ అసిస్టెంట్, వివిధ శాఖల అధికారులు గ్రామస్తులు పాల్గొన్నారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...