తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలి


Wed,January 24, 2018 01:14 AM

-బీ ఏ స్టార్ ఇన్ స్టడీస్ అవగాహన సదస్సులో ఎస్పీ విజయ్‌కుమార్
గద్వాల క్రైం : ప్రతి విద్యార్థి తమపై నమ్మకం పెట్టుకొని జీవిస్తున్న తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని ఎస్పీ ఎస్‌ఎం విజయ్‌కుమార్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రం గద్వాలలోని సత్యసాయి డిగ్రీ కళాశాలలో బీ ఏ స్టార్ ఇన్ స్టడీస్ అనే అంశంపై మంగళవారం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థినులనుద్దేశించి మాట్లాడారు. ఏవిధంగా దొరకని గొప్ప గౌరవ మర్యాదలు విద్య వల్లనే లభిస్తాయ న్నారు. చదువును ఎన్నటికీ నిర్లక్ష్యం చేయరా దన్నారు. విద్యార్థి దశ నుంచే ఉన్నత విలువలను సంపాదించాలన్నారు. తాము పెట్టుకున్న లక్ష్యాలను చేరుకోడానికి తప్పని సరిగా కార్యసాధన అవసరమన్నారు. కృషి, పట్టుదల, కసి, ఏకాగ్రత, పక్కా ప్రణాళిక ఉంటే విజయం తమ చెంతకు చేరుతుందని ఎస్పీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఉద్యోగా న్వేషణకు ఇంటర్ కీలక ఘట్టమన్నారు.

కష్టపడితేనే ఫలితం విలువ తెలుస్తుం దన్నారు. లక్ష్యం చేరే క్రమంలో ఎన్నో ఆటంకాలు ఎదురవుతుంటాయని, వాటిని అధిగమించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. పోటీ పరీక్షలకు తప్పని సరిగా అకాడమిక్ పుస్తకాలతో పాటు పత్రికలు ఎప్పటికప్పుడు రెఫర్ చేస్తుండాలన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ మొదలైన ఉన్నత స్థాయి ఉద్యోగాలు పొందాలనుకున్నపుడు ఇప్పటి నుంచే శ్రమపడాలన్నారు. అందుకు కఠోర సాధన చాలా అవసరమన్నారు. తామెంచుకున్న లక్ష్యం పక్కాగా అమలు చేసి చేరుకున్నపుడే సమాజంలో ఒక స్టార్‌గా ఎదుగుతామన్నారు. అనంతరం సైకాలజిస్టు శ్రీనివాసాచారి పలు అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పాలమూరు యూనివర్శిటీ రిజిస్ట్రార్ పాండు రంగారెడ్డి, డీఈవో వేణుగోపాల్, కళాశాల కరస్పాండెంట్ మాకం బీచుపల్లి, ప్రిన్సిపాల్ అనూష, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...