వైభవంగా ఆంజనేయస్వామి రథోత్సవం


Wed,January 24, 2018 01:14 AM

ధరూర్ : చింతరేవుల ఆంజనేయస్వామి రథోత్సవం సోమవారం రాత్రి వైభవోపేతంగా కన్నుల పండువగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వార్ల రథోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా అశేష భక్త జనవాహిని మధ్య ఆంజనేయ స్మరణతో సర్వాంగ సుందరంగా అలంకరించిన తేరుపై ఉత్సవ మూర్తులను ఉంచి ఘనంగా రథోత్సవం నిర్వహించారు. పరిసర గ్రామాల నుంచి అధిక సంఖ్యలో హాజరైన భక్తుల జయజయ ధ్వానాల మధ్య మూడు గంటల పాటు కొనసాగింది. ఆలయ ప్రాంగణం నుంచి పాండురంగడి స్వామి దేవాలయం ఆవరణ వరకు రథోత్సవం నిర్వహించారు. బాణాసంచా వెలుగుల మధ్య భక్తుల కేరింతల మధ్య ఉత్సాహంగా రథోత్సవం కొనసాగించారు. మంగళవారం ఉదయం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామి వార్లను దర్శించుకున్నారు హరినామ సంకీర్తన సమితి గద్వాల వారిచే భక్తి గీతాల సంగీత విభావరి నిర్వహించారు. జాతర ప్రాంగణంలో వెలసిన దుకాణాల వద్ద కొనుగోళ్లతో సందడి చేశారు. రేవులపల్లి పోలీసులు బందోబస్తును పర్యవేక్షించారు. కార్యక్రమంలో ధర్మకర్త గిరిరావు, అర్చకులు భీంసేనాచారి, సర్పంచి సావిత్రి హన్మంతరాయ, స్థానిక టీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకులు, దేవాదాయ శాఖ సిబ్బంది రామన్ గౌడ్, వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...