ఘనంగా సుభాష్ చంద్రబోస్ జయంతి


Wed,January 24, 2018 01:14 AM

అయిజ : నగరపంచాయతీలోని వివేక్ గురుకుల కోచింగ్ సెంటర్‌లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. ఏబీవీపీ రాష్ట్ర కమిటీ సభ్యుడు పరశురాం ఆధ్వర్యంలో సుభాష్‌చంద్రబోస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో అనిల్, మహేష్, ఉపా ధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

వడ్డేపల్లిలో..
వడ్డేపల్లి : మండల కేంద్రంలో సుభాష్ చంద్రబోస్ జయంతిని మంగళవారం శ్రీనివాస డిగ్రీ కళాశాలలో కరస్పాండెంట్ కిట్టు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సుభాష్ చంద్రబోస్ జన్మదినాన్ని దేశ్‌ప్రేమ్ దివస్‌గా జరుపుకుంటామని, అజాద్ హిందూ ఫౌజ్ సైన్యాన్ని ఏర్పాటు చేశారని విద్యార్థులకు వివరించా రు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మల్లు, అధ్యాపకులు అమీర్ పాషా, ప్రవీణ్ కుమార్, నరహరి, రాఘవేంద్ర, నాగమణిలు పాల్గొన్నారు.

సాతర్లలో..
ఇటిక్యాల : మండలంలోని సాతర్ల గ్రామంలో స్వాతంత్య్ర పోరాటయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 121వ జయంతి వేడుకలను నిర్వహించారు. బీజేపీ మైనార్టీ మోర్చా ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో సుభాష్‌చిత్రపటానికి పూలమాల వేసి స్వాతంత్య్ర ఉద్యమంలో ఆయన జరిపిన పోరాటాలను స్మరించుకొన్నారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు పలు రకాల పోటీలను నిర్వహించి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు జమీర్, అబ్దుల్లా, నాగార్జునరెడ్డి, వెం కటేశ్, లింగన్న, రాముడు, అనిల్, పరమేష్ పాల్గొన్నా రు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...