ఉత్సాహంగా పశుబల ప్రదర్శన పోటీలు


Wed,January 24, 2018 01:13 AM

అయిజ : ఉత్తనూరు గ్రామంలోని ధన్వంతరి వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పశుబల ప్రదర్శన పోటీలు ఉత్సాహంగా.. ఉల్లాసంగా కొనసాగుతున్నాయి. మంగవారం తెలంగాణ, కర్ణాటక, ఆంధ్ర రాష్ర్టాల నుంచి తరలివచ్చిన వృషభరాజములు పశుబల ప్రదర్శనలో పాల్గొంటుండగా పోటీలను తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి రైతులు, యువకులు అధిక సంఖ్యలో తరలివచ్చి తిలకిస్తున్నారు. ప్రతి ఏటా నిర్వహించే విధంగా ఎన్టీఆర్ మినీ స్టేడియంలో నిర్వహిస్తున్న అఖిల భారత ఒంగోలు గోజాతి పోషక, ప్రోత్సాహక సంక్షేమ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోటీలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. సోమవారం ప్రారంభమైన పాలపళ్ల విభాగం ప్రదర్శన పోటీలు మంగళవారం ముగియగా, న్యూ కేటగిరీ విభా గం పోటీలు పోటీలు ప్రారంభమైనాయి. ఈ పోటీల్లో 9 జతల వృషరాజములు తరలివచ్చినట్లు నిర్వహకులు తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం సబ్ జూని యర్స్ విభాగం పోటీలు నిర్వహించను న్నట్లు దేవస్థాన కమిటీ తెలిపింది. ఈ పోటీలకు వృషభరాజములు ఇప్పటికే తరలివచ్చి నట్లు పేర్కొంది.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...