రూ.కోటితో గ్రంథాలయాన్ని నిర్మిద్దాం


Tue,January 23, 2018 01:31 AM

మల్దకల్ : మండల కేంద్రంలో కోటి రూపాయలతో అధునాథనమైన ప్రతి ఒక్కరికీ ఉపయోగపడే గ్రంథాల యాన్ని నిర్మించాలని నడిగడ్డ యువత అధ్యక్షుడు వెంకటేష్ నాయుడు, ప్రధాన కార్యదర్శి తిరుమలేష్‌లు అన్నారు. అలాగే మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసే ప్లెక్సీలను అందరం కలిసికట్టుగా నిషేధిద్దామని వారు పేర్కొన్నారు. ఈ పనులు చేయడానికి అధికారుల సహాయ సహకారాలు ఎంతో అవసరమని వారు పేర్కొన్నారు. సోమవారం మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాల యంలో సంఘ సభ్యులు మండల తహసీల్దార్ వీర భద్రప్పకు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా మండల వారు మాట్లాడుతూ రాజకీయ నాయకుల, పండుగలు, పుట్టిన వేడుకలకు వివిధ రకాలైన పనులకు ప్రతి గ్రామంలో ప్లెక్సీలు వేయడం ప్యాషన్‌గా మారిందన్నారు. వాటిని ఏర్పాటు చేయడం వల్ల ఏ ఒక్క సామాన్య ప్రజలకు ఎలాంటి ఉపయోగాలు ఉండవన్నారు.

వీటికి ఖర్చు చేసే డబ్బులను ఒక గ్రంథాలయానికి నిధులు కేటాయించి నట్లయితే విద్యార్థులకు, నిరుద్యోగులకు, సామాన్య ప్రజలకు ప్రతి నిత్యం వార్తా పత్రికలు, దేశ నాయకుల చరిత్రలు, దేశ విదేశాలకు చెందిన పుస్తకాలు ఉంచితే పరిజ్ఞానం పెంపొందుతుందన్నారు. కావున తహసీల్దార్ ఈ ప్లెక్సీలను నిషేధించి వాటికి అయ్యే ఖర్చులను నూతన గ్రంథాలయ నిర్మాణానికి ఖర్చు చేసేవిధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఈ విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని వారు కోరారు. కార్యక్రమంలో నడిగడ్డ సంఘం నాయకులు మహేంద్రగౌడ్, నర్సింహులు, తిమ్మప్ప, పరుశరాముడు, నాగరాజు, జయరాములు, నర్సింహులు, వినోద్ పాల్గొన్నారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...