వసతులు లేకనే వెనుకబాటు


Tue,January 23, 2018 01:31 AM

కేటీదొడ్డి : నడిగడ్డ ప్రాంతం వెనుకబాటుకు ప్రధాన కారణం వసతుల లేమి కారణమని, దాన్ని పూడ్చుకోవడానికి విద్యపరంగా నూతన గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని నడిగడ్డ యువత జిల్లా కన్వీనర్ లక్ష్మీకాంత్‌గౌడ్ అన్నారు. నూతనంగా ఏర్పడిన కేటీదొడ్డి మండలానికి గ్రంథాలయం తప్పనిసరిగా కావాలని నడిగడ్డ యువత సభ్యులు మండల కేంద్రంలో తహసీల్దార్ మల్లికార్జున్‌రెడ్డికి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త మండలానికి గ్రంథాలయం చాలా అవసరమన్నారు. ఇక్కడి ప్రాంతంలో గ్రంథాలయాలు లేకపోవడంతో యువకులు, ప్రజలు అభివృద్ధిలో వెనుకబడ్డారని తెలిపారు. ఇక్కడి ప్రాంత వాసులం వెనుకబడ్డానికి ప్రధాన కారణం విద్య లేకపోవడమేనన్నారు. ఉన్నదాంట్లోనూ ఎలాంటి సౌకర్యాలు లేక ప్రపంచంలో జరిగే సంఘటనలు మనకు తొందరగా తెలువకపోవడం కూడా కారణమ న్నారు. దీనిని నివారించాలంటే కోటి రూపాయలతో ఒక అధునాతన గ్రంథాలయం నిర్మించాలని వినతిపత్రం ద్వారా కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్లు లక్ష్మీకాంత్, రామకృష్ణ, కేటీదొడ్డి మండల నడిగడ్డ యువత అధ్యక్షుడు రమేషాచారి, ప్రధాన కార్యదర్శి నరసింహ, కన్వీనర్ రాజు, జగదీష్, గ్రామాధ్యక్షుడు జయన్న పాల్గొన్నారు.

87
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...