మతిస్థిమితం లేని యువకుడికి సపర్యలు


Tue,January 23, 2018 01:30 AM

ధరూర్ : మండల పరిధిలోని మాల్‌దొడ్డి గ్రామ శివారులో గడిచిన ఆరు నెలలుగా మతిస్థిమితం లేకుండా ఉన్న యువకుడికి రేవులపల్లి పోలీస్ స్టేషన్ సామాజిక పోలీస్ నజీర్, మాల్‌దొడ్డి గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్ నాయకుడు, సామాజిక కార్యకర్త అంజిసాగర్‌లు కలిసి సోమవారం సపర్యలు చేశారు. మతిస్థిమితం సరిగా లేకుండా ఒంటిపై సరిగా బట్టలు లేకుండా ఉన్న ఓ యువకుడు కొద్ది రోజుల క్రితం మాల్‌దొడ్డి శివాంజనేయ స్వామి దేవాలయం లో తలదాచుకుంటున్నాడు. గ్రామస్తులు ఏదైనా ఆహారం ఇస్తే తినేవాడు. ఈ క్రమంలో చాలా రోజుల నుంచి స్నానం లేక వేసుకున్న బట్టలు మాసిపోయి, యువకుడు నుంచి దుర్వాసన రావడంతో గ్రామస్తులు కొద్ది రోజలు నుంచి ఛీదరించుకుంటున్నారు. స్పందించిన సామాజిక కార్యకర్త అంజిసాగర్, కానిస్టేబుల్ నజీర్‌కు సమాచారం అందించడంతో సోమవారం ఆ యువకుడికి సపర్యలు చేశారు. క్షవరం చేయించి, గుండు గీయించారు. బోరింగ్ దగ్గర స్నానం చేయించి, కొత్త బట్టలు వేయించారు. కేవలం హిందీ మాత్రమే మాట్లాడుతూ తన పేరు సునీల్‌గా చెబుతున్నాడని, తన గురించి చెప్పడానికి మతిస్థిమితం సరిగా లేదని, వివరాలు రాబట్టడానికి ప్రయత్నించి, సొంతవారికి చేర్చే విధంగా చర్యలు తీసుకుంటామని నజీర్ తెలిపారు.

152
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...