ఘనంగా కృష్ణవర్ధన్‌రెడ్డి వర్ధంతి


Tue,January 23, 2018 01:30 AM

మల్దకల్ : మండలంలోని ఎల్కూర్‌లో సోమవారం కృష్ణవర్ధన్‌రెడ్డి 39వ వర్ధంతిని గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. కృష్ణవర్ధన్ రెడ్డి గతంలో జోగుళాంబ గద్వాల్ జిల్లాలో ఎంతో పేరెన్నిక గల ప్రజా ప్రతినిధిగా ఉన్నాడన్నారు. కాగా అతని మరణానంతరం గ్రామ ప్రజలు ప్రత్యేకంగా దేవాలయాన్ని నిర్మించి ప్రతి ఏటా జయంతి, వర్ధంతిని కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు ఘనంగా నిర్వహిస్తారు. అతని వర్ధంతి సందర్భంగా అతనికి నిర్మించిన దేవాలయం దగ్గర కుటుంబ సభ్యులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. అనంతరం ప్రజలకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు చక్రధర్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, గంగాధర్ హెచ్‌ఎం. చాంద్‌పాషా, కృష్ణవర్ధన్‌రెడ్డి మెమోరియల్ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...