వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి


Tue,January 23, 2018 01:30 AM

గద్వాలటౌన్ : ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఉందని డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ శ్రీనివాసులు సూచించారు. జిల్లా కేంద్రంలోని మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్న ప్రియదర్శిని మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులకు సోమవారం ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థిని కనీస ఆరోగ్య సూచనలు, జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. ఆరోగ్యంగా ఉంటేనే చదువుపై శ్రద్ధ పెరుగుతుందని సూచించారు. పరీక్షల సమయంలో ఆరోగ్య పరిరక్షణపై మరింత దృష్టి సారించాలన్నారు. ఈ సమయంలో రక్తహీనతకు గురువుతుంటారని, రక్తహీనతకు గురైన విద్యార్థినులు ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకుంటూ సరైన పోషకాహారం తీసుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థినీలను పరీక్షించారు. కార్యక్రమంలో డీపీఎం మల్లికార్జున్, సీహెచ్‌వో రామకృష్ణ, ప్రిన్సిపాల్ డాక్టర్ జాఫరున్నిసాభేగం పాల్గొన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...