శెట్టి ఆత్మకూర్‌లో స్వేరోస్ గ్రామ కమిటీ ఎన్నిక


Sun,January 21, 2018 11:33 PM

గద్వాల రూరల్ : గ్రామాల్లో బాల్య వివాహాలు మూఢ నమ్మకాలను పారద్రోలాలని, తల్లిదండ్రులు తమ పిల్లలను క్రమంగా పాఠశాలకు పంపి చదువుకునేందుకు ప్రోత్సహించాలని స్వేరోస్ జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ అన్నారు. ఆదివారం మండల పరిధిలోని శెట్టి ఆత్మకూర్ గ్రామంలో, స్వేరోస్ గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నుకోబడిన సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు. ఫిబ్రవరి 4న జరిగే జ్ఞాన మహాసభలను విజయవంతం చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ ఈ మహాసభలకు తరలి రావాలన్నారు. ఐపీయస్ ప్రవీణ్ కుమార్ ఆశయాల సాధనకై కృషి చేయాలని పిలుపునిచ్చారు. శెట్టి ఆత్మకూర్ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా శాంతన్న, ప్రధాన కార్యదర్శిగా విష్ణు, సహాయ కార్యదర్శిగా కృష్ణ, బలరాం, అధికార ప్రతినిధిగా హనుమంతు, గౌరవ సభ్యులుగా జయరాజు, అశోక్ కుమార్‌ను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో స్వేరోస్ మండల అధ్యక్షుడు యేసు, గద్వాల తాలూకా ఇన్‌చార్జి నర్సింహులు, ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ పాల్గొన్నారు.

71
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...