పల్స్‌పోలియోను విజయవంతం చేయండి


Sun,January 21, 2018 11:33 PM

-హెల్త్ సూపర్‌వైజర్ శ్యాంసుందర్
మల్దకల్ : ఈ నెల 28వ తేదీన నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని హెల్త్ సూపర్‌వైజర్ శ్యాంసుందర్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ మండల వైద్యాధికారిణి డాక్టర్ శశికళ ఆధ్వర్యంలో నాలుగు రూట్లలో పోలియో చుక్కల మందును వేయించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. 0-5 సంవత్సరాల పిల్లలకు ఈ నెల 28వ తేదీన ప్రతి ఒక్కరికీ చుక్కుల మందును తాపించాలన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కింద 10 సబ్ సెంటర్లు పని చేస్తున్నాయని, ఈ సెంటర్ల కింద మొత్తం 6,732 మంది చిన్నారులు ఉన్నట్లు ఇప్పటికే గుర్తించామన్నారు. మొత్తం నాలుగు రూట్లుగా గుర్తించామన్నారు. అన్ని గ్రామాల్లో కలిపి 42 బూతులుగా ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికీ అన్ని రూట్లలో అంగన్‌వాడీ కార్యకర్తలు 56 మంది, ఆశ కార్యకర్తలు 53 మంది, ఏఎన్‌ఎంలు పాల్గొంటారన్నారు. మల్దకల్ మండల కేంద్రంలో బస్టాండ్ ప్రాంతంతో ఇంకా అన్ని ముఖ్య కూడళ్ల దగ్గర చిన్నారి పిల్లలకు చుక్కల మందులను వేయిస్తామన్నారు. చుక్కల మందు మూడు రోజుల పాటు వేస్తారన్నారు. మొదటి రోజు తప్పి పోయిన పిల్లలకు అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశ కార్యకర్తల సహాయంతో ఇంటింటికీ తిరిగి రెండు రోజుల పాటు చుక్కల మందులు వేస్తారన్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...