కొనసాగుతున్న చింతరేవుల బ్రహ్మోత్సవాలు


Sun,January 21, 2018 11:33 PM

ధరూర్ : చింతరేవుల ఆంజనేయ స్వామి జాతర బ్రహ్మోత్సవాలు కొనసా గుతున్నట్లు ఆలయ ధర్మకర్త గిరిరావు,అర్చకులు భీంసేనా చారి లు తెలిపా రు. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం స్వామి వారికి పంచామృతా భిషేకం, విశేషాలంకరణ, ఉపనయనం, పల్లకీసేవ, ప్రభోత్సవం కార్యక్రమా లను ఘనంగా నిర్వహించారు. స్వామి వారి ఉత్సవమూర్తులను ఉంచిన పల్లకీలో స్వామిని వారిని దశమి కట్ట వరకు ఊరేగించారు. అనంతరం స్వా మి వారిక స్థానిక కోనరులో పల్లకీసేవ నిర్వహించారు. అనంతరం ప్రభో త్సవం నిర్వహించారు. పరిసర గ్రామాల భక్తులు అధిక సంఖ్యలో హాజర య్యారు. సోమవారం రాత్రి స్వామి వారి రథోత్సవం ఘనంగా నిర్వహించేదుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా జాతరలో తరలివస్తున్న భక్తులతో సందడిగా మారింది. కార్యక్రమంలో ధర్మకర్త గిరిరావు, దేవాదాయ శాఖ సిబ్బంది వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...