నేడు అయిజకు.. మంత్రి జూపల్లి కృష్ణారావు రాక

Sun,January 21, 2018 11:33 PM

అయిజ : పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా మార్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. ఇంతకాలం పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న చిన్నారులకు సొంత భవనాలను ఏర్పాటు చేస్తుండటంతోపాటు సౌకర్యాలను కల్పిస్తోంది. అయిజ మండలంలోని పలు గ్రామాలలోని అంగన్‌వాడీ కేంద్రాలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఒక్కో భవనాన్ని ఎన్‌ఆర్‌ఈజీఎస్ పథకం కింద భవనాలను నిర్మిస్తోంది. మండలంలోని పలు గ్రామాలలో 22 అంగన్‌వాడీ కేంద్రాలను ప్రభుత్వం నిర్మిస్తోంది. ఇందులో భాగంగా అంగన్‌వాడీ భవనాలు పూర్తైయిన వాటిని ప్రారంభోత్సవం చేయనున్నారు. మండలంలోని ఉత్తనూరు, సంకాపురం గ్రామంలలోని అంగన్‌వాడీ భవనాలకు ప్రారంభోత్సవం, ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులు రూ. 13 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఉత్తనూరు గ్రామ పంచా యతీ భవన నిర్మాణానికి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శంకుస్థాపన చేయనున్నారు.

రూ. 32 లక్షలతో పీఏసీఎస్ అదనపు దుకాణాలు
అయిజ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం దిన దినాభివృద్ధి చెందు తుండటంతో పీఏసీఎస్ అనుసంధానంగా డీసీసీబీ బ్యాంకును ఏర్పాటు చేస్తుండటంతోపాటు సంఘాన్ని బలోపేతం చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం అవనపు దుకాణాలను నిర్మించింది. పీఏసీఎస్ అధ్యక్షుడు సంకాపురం రాముడు కృషితో డీసీసీబీ రూ. 32 లక్షలు రుణం ఇవ్వడంతో 10 అదనపు దుకాణాల సమూదాయాన్ని నిర్మించారు. భవన నిర్మాణాలు పూర్తి కావడంతో పీఏసీఎస్ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. పీఏసీఎస్ అదనపు భవనాలు, ఉత్తనూరు, సంకాపురం గ్రామాలలో రూ. 61 లక్షల వ్యయంతో నిర్మించిన భవనాలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేసేందుకు సోమవారం రాష్ట్ర పంచా యతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చేయనున్నారు.

అయిజ పీఏసీఎస్‌లోని మొదటి అంతస్తులో నిర్మించిన 10 అదనపు భవ నాలు, ఉత్తనూరు, సంకాపురం గ్రామాలలో ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధుల కింద రూ. 16 లక్షల వ్యయంతో నిర్మించిన రెండు అంగన్‌వాడీ భవనాలను ప్రా రంభించనుండగా, ఎన్‌ఆర్‌ఈజీఎస్ కింద నిర్మించనున్న ఉత్తనూరు గ్రామ పంచాయతీ కార్యాలయానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమా నికి జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, డీసీసీబీ చైర్మన్ వీరారెడ్డి, ఎంపీ నంది ఎల్లయ్య, ఎమ్మెల్యే సంపత్‌కుమార్, ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి, జనార్ధన్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి, రామచంద్రారావులు హాజరవుతున్నట్లు ఎంపీపీ సుందర్‌రాజు, ఏపీసీఎస్ అధ్యక్షుడు సంకాపురం రాముడులు తెలిపారు.

69
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles