మత్స్యకారులకు మంచిరోజులు !

Sun,January 21, 2018 02:31 AM

-18 కాలమ్స్ ఫార్మేట్‌లో వివరాల నమోదు
-జిల్లాలో కొనసాగుతున్న మత్స్యకారుల సర్వే
-పేర్లు, ఫోన్, ఆధార్ నెంబర్లు, బ్యాంకు ఖాతా, నామినీ వివరాల సేకరణ
-38 సొసైటీల్లో 2000 మంది చేపలు పట్టేవారు
-70శాతం పూర్తయిన సర్వే
-పథకాల పారదర్శకత కోసమే
-మత్స్యకారుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదుచేస్తున్న అధికారులు
-కులవృత్తుల బలోపేతానికి ప్రభుత్వం చర్యలు
-సంతోషం వ్యక్తం చేస్తున్న మత్స్యకారులు
జోగుళాంబ గద్వాల, నమస్తే తెలంగాణ ప్రతినిధి : కులవృత్తుల బలోపేతానికి ప్రభుత్వం బృహత్తర కార్యక్రమాలు చేపడుతున్నది. గ్రామాల్లో కులవృత్తులు చేసుకొనే వృత్తి దారులకు ఆదాయ మార్గాలను అందించడం ద్వారా గ్రామాలు ఆర్థికంగా బలోపేతం అవుతాయని ముఖ్యమంత్రి కేసీఆర్ వినూత్న పథకాలను చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు పక్కదారి పట్టకుండా లబ్ధిదారులకు అందేలా పక్కాగా చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే జిల్లాలోని మత్స్యకారుల వివరాలు సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు.

38 సొసైటీలు, 2000మంది మత్స్యకారులు

జిల్లాలో 38 సొసైటీలలో 2000 మంది మత్సకారులు ఉన్నట్టుగా మత్స్యశాఖ అధికారులు గుర్తించారు. ఈ సభ్యుల పూర్తి విరాలతోపాటు వారి గ్రామాల్లోని చెరువులు, కుంటల వివరాలను కూడా సేకరిస్తున్నారు. ఇందుకోసం మత్స్యశాఖ అధికారుల ప్రత్యేక ఫార్మేట్‌ను కూడా రూపొందించారు. ఇందులో 21కాలమ్స్‌తో మత్స్యకారుల వివరాలను సేకరిస్తున్నారు. మత్స్యకారుడి పూర్తి పేరు, తండ్రిపేరు, లింగం, పుట్టిన తేది, ఫోన్ నెంబర్, ఆధార్ కార్డ్ నెంబర్, బ్యాంక్‌ఖాతా నంబర్, నామినీ తదితర పూర్తి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. అంతే కాకుండా మత్స్యకారుల సంఘాలకు సంబంధించి 18కాలమ్స్‌తో రూపొందించిన ఫార్మేట్‌లో చెరువుల, కుంటలకు సంబంధించిన సమాచారం సేకరిస్తున్నారు. జిల్లాలో 12 మండలాల్లో ఇప్పటికే దాదాపుగా 70శాతం వరకు సర్వే పూర్తయ్యింది. సర్వేలో సేకరించిన వివరాలను మత్స్యశాఖ అధికారులు ఆన్‌లైన్‌లో నమోదు చేయనున్నారు.

పథకాల పారదర్శకత కోసమే

ప్రభుత్వం కులవృత్తులకు జీవం పోసేందుకు దేశంలో ఎక్కడాలేని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. ఇటీవల గొర్రెల కాపరుల కోసం చేపట్టిన గొర్రెల పంపిణీ కార్యక్రమం విజయవంతం అవడంతో ప్రతి కులానికి కూడా ఇదే తరహాలో లబ్ధిచేకూరేలా పథకాలను అందజేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందుకుసాగుతున్నది. ఈ క్రమంలోనే మత్స్యకారులకూ పథకాలను అందించేదుకు చర్యలు చేపడుతున్నది. ఈ పథకాలు పక్కదారి పట్టకుండా ఒక్కరే పలుమార్లు లబ్ధిపొందకుండా అర్హతలను బట్టి ప్రభుత్వ పథకాలు అందించేందుకు ఈ సర్వేను చేపట్టింది.
మత్స్యశాఖ అమలు చేసే పథకాలు
-100శాతం సబ్సిడీతో చేపల మార్కెట్ అభివృద్ధి
-90శాతం సబ్సిడీతో చేపపిల్లల ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటు
-80శాతం సబ్సిడీతో టూరిజం డెవలప్‌మెంట్
-75శాతం సబ్సిడీతో చేపల తరలింపునకు వాహనాలు
-రూ.10లక్షల వ్యయంతో నిర్మించే కమ్యూనిటీహాల్ భవనాలకు రూ.9లక్షల చొప్పున కేటాయింపు
-సభ్యత్వం ఉన్న ప్రతి మత్స్యకారుడికి రూ.6లక్షల ప్రమాద బీమా సౌఖర్యం

సర్వే ప్రారంభంతో నూతనోత్సాహం

ప్రభుత్వం మత్స్యకారుల వివరాలను సేకరించడం చాలా సంతోషంగా ఉంది. గొర్రెలకు కాపరులకు గొర్రెలను అందిచినట్టుగా తమకు కూడా సంక్షేమ పథకాలు అందించ నున్నది. ఈ సర్వే చేపట్టడంతో మత్స్యకారుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. కులవృత్తిదారుల కష్టాల తెలిసిన కేసీఆర్ సీఎంగా ఉండటం ఎంతో ఆనందంగా ఉంది. వీలైనంత త్వరగా పథకాలను అందించాలని కోరుతున్నా.

70శాతం సర్వేపూర్తి

జిల్లాలోని 12మండలాల్లో మత్స్యకారుల వివరాలు సేకరిస్తున్నాం. ఇప్పటి వరకు 70శాతం సర్వేను పూర్తి చేశాం. ఈ వివరాలన్నింటిని ఆన్‌లైన్‌లో నమోదు చేస్తాం. ప్రభుత్వం మత్స్యకారులకు అందించే అన్ని పథకాలను మేము సేకరిస్తున్న వివరాల ఆధారంగానే అందజేస్తాము. ప్రతి ఒక్క మత్స్యకారుడు కూడా తమ వివరాలను ఇందులో నమోదు చేసుకోవాలి. వివరాలను అందించిన మత్స్యకారులు మాత్రమే ప్రభుత్వం నుంచి అందే పథకాలు అందుకోవాడానికి అర్హులు అవుతారు.
-మధు,మత్స్యశాఖ జిల్లా అధికారి

మత్స్యకారులను ఆదుకుంటున్న ప్రభుత్వం

గత ప్రభుత్వాలు మత్స్యకారులను నిర్లక్ష్యం చేశాయి. ఏ ఒక్కరు కూడా తమను పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం అన్ని కుల వృత్తులను ఆదుకుంటున్నది. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకునేలా పాలన చేస్తున్నారు. మత్సకారులను కూడా ఆదుకుంటారని నమ్మకం మాకు ఉంది. సర్వేలో అధికారులకు సహకరిస్తూ అన్ని వివరాలను అందిస్తున్నాం.
- చిన్ననాగరాజు, మత్స్యకార సంఘం సభ్యుడు, రాజోళి

71
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles