కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

Sun,January 21, 2018 02:29 AM

-దర్శించుకున్న ప్రముఖులు
-అలంకరించిన ఆలయాలు
-ఆలయాల్లో భక్తుల సందడి
అలంపూర్, నమస్తే తెలంగాణ : ఐదవ శక్తి పీఠమైన అలంపూర్ జోగుళాం బ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాల్లో గత నాలుగు రోజులుగా వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో మూడో రోజు అమ్మ వారి ఆలయంలో అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. చండీ హోమాలు, పవమాన సూక్త పారాయణ హోమాలు, ఆవాహిత దేవతా హోమములు మండపారాదన బలిహరణ చివరగా నీరాజన మంత్ర పుష్పములు మొదలగు పూజా ఆకార్యక్రమాలు సాంప్రదాయ బద్దంగా నిర్వహించారు.ఉత్సవాలను తిలకించేందుకు భక్త యాత్రికులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. మరో వైపు యాగశాలలో చండీహోమాలు కొనసాగాయి.ఆలయం లో నిర్వహించిన కుంకుమార్చన, ఖడ్గమాల, త్రిశతి అర్చన మొదలగు పూజలు నిర్వహించారు. నిజామాబాద్ డిఎస్పీ, రోడ్లు, భవనాలు శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ లింగయ్య ఆలయాలను దర్శించుకున్నారు. ఆలయాధికారులు చైర్మన్ తిరుపతిరెడ్డి వారిని సాదరంగా ఆహ్వానించారు. స్వామి వారి అమ్మ వారి ఆలయాల్లో వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

97
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles