పల్స్‌పోలియోపై వ్యాక్సినేటర్లకు..వైద్యుల సమావేశంలో డీఎంహెచ్‌వో సునీత

Sun,January 21, 2018 02:28 AM

గద్వాలటౌన్ : పల్స్‌పోలీయో కార్యక్రమ నిర్వహణపై ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వ్యాక్సినేటర్లకు పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వాలని డీఎంహెచ్‌వో డాక్టర్ సునీత వైద్యాధికారులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్‌వో కార్యాలయంలో శనివారం జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులకు, విద్యాధికారులకు, ఆరోగ్య సిబ్బందికి పల్స్‌పోలియో కార్యక్రమంపై శిక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై అవగాహన కల్పించారు. ప్రతి పోలియో కేంద్రంలో నలుగురు సిబ్బంది కచ్చితంగా ఉండాలని చెప్పారు. ప్రాథమిక కేంద్రాలకు సామగ్రిని ఇప్పటికే సరఫరా చేయడం జరిగిందని తెలిపారు. గ్రామీణ స్థాయిలో పంపిణీ చేయాలని సూచించారు. గ్రామాల్లో ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించి అవగాహన కల్పించాలని ఆదేశించారు. పాఠశాలల్లో ప్రార్థన సమయంలో విద్యార్థులకు మందును పంపిణీ చేయాలని చెప్పారు. అనంతరం అల్బెండజోల్ మాత్రల పంపిణీపై ఆర్‌బీఎస్‌కే జిల్లా కో-ఆర్డినేటర్ డాక్టర్ శశికళ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ప్రతి ఏడాదీ రెండు విడతలుగా మందును పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి 9, 15 తేదీల్లో మాత్రల పంపిణీ కార్యక్రమం ఉంటుందని చెప్పారు. మాత్రల పంపిణీపై ర్యాలీలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో డిప్యూటీ డీంఎంహెచ్‌వో శ్రీనివాస్, డీపీహెచ్‌ఎన్‌వో కాంత, సీహెచ్‌వో రామకృష్ణ, హెచ్‌ఈవో నరేందర్, హెచ్‌ఈ నాగరాజుశెట్టి, వైద్యాధికారులు, సూపర్‌వైజర్లు, విద్యాధికారులు పాల్గొన్నారు.

61
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles