స్టేడియం అభివృద్ధికి కృషి


Sun,January 21, 2018 02:27 AM

గద్వాల టౌన్ : ఇండోర్ స్టేడియాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే డీకే అరుణ అన్నారు. జిల్లా కేంద్రంలోని చింతలపేటలోని ఇండోర్ స్టేడియానికి సీడీపీ నిధులు రూ.10 లక్షలు వెచ్చించి చేపట్టనున్న కాంపౌండ్ వాల్ నిర్మాణానికి, సీసీ డ్రైనేజీ నిర్మాణానికి శనివారం ఆమె భూమి పూజ చేశారు. అనంతరం పలు వార్డుల్లో నిర్వహించిన స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ కృష్ణవేణి, నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, కౌన్సిలర్లు నర్సింహులు, జయమ్మ, జయశ్రీ, జయలక్ష్మి, భాస్కర్‌యాదవ్ పాల్గొన్నారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...