ఐటీ నిఘా..


Thu,January 12, 2017 01:44 AM

-రూ.2.5 లక్షలు దాటిన ఖాతాదారులకు నోటీసులు
-జిల్లాలో వేల మందికి జారీ
-లావాదేవీలపై వివరాలివ్వాలన్న ఐటీ
-50 రోజుల బదిలీలపై నిఘా
-బ్యాంకర్ల నుంచి పూర్తి వివరాల సేకరణ
-ఆందోళనలో పడ్డ బడాబాబులు

గద్వాల, నమస్తే తెలంగాణ ప్రతినిధి : అనుకున్నట్టుగానే.. ఐటీ శాఖ రంగంలోకి దిగింది. నోట్ల రద్దు, నగదు మార్పిడి వ్యవహారంలో బ్యాంకుల నుంచి జరిగిన లావాదేవీలపై నజర్ పడింది. ప్రధానంగా నవంబర్ 8 నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు జరిగిన బ్యాంకు లావాదేవీలపై నోటీసులు మొదలయ్యాయి. గతేడాది నుంచి పోలిస్తే.. ఒకేసారి 52 రోజుల వ్యవధిలో లక్షల రూపాయలు బ్యాంకు ఖాతాల నుంచి బ దిలీలు జరిపిన వారికి ఐటీ శాఖ నోటీసులు జారీ చే సింది. ఇప్పటికే పలు గ్రామాలకు ఈ నోటీసులు వెళ్లా యి. దాదాపు మొదటి విడతలో రూ.5లక్షలకు మిం చిన వారికి నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది.

బ్యాంకర్ల నుంచి పూర్తి వివరాలు సేకరించిన తర్వాత నిబంధనల ప్రకారం రూ. 2.5 లక్షలకు మించి నగదు బదిలీ జరిగిన ఖాతాదారులకు ఐటీ నోటీసులు అందనున్నాయి. ప్రస్తుతం రూ.5, 10 లక్షలకు మించి నగదు బదిలీ చేసిన వారికి నోటీసులు పంపినట్లు తెలిసింది. ఐటీ నోటీసుల నేపథ్యంలో సహజంగానే ఆయా ఖా తాదారుల్లో కొంత ఆందోళన పరిస్థితి నెలకొంది. అం తేకాకుండా కొంత మంది బంధువుల కోసం, కమీషన్ కోసమో తమ ఖాతాల నుంచి నగదు బదిలీ చేశా రు. ఇప్పుడు ఆ వ్యవహారం వారి మెడకు చుట్టుకుంటోంది. రూ.2.5 లక్షలు మించి నగదు బదిలీ, లావాదేవీలు జరిపిన వారి నుంచి ఐటీ పన్ను వసూలు చేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఒక్కొక్కరు ఇప్పటి నుంచే కొంత ఆందోళన చెందుతున్నారు.

ఎలా.. ఎక్కడి నుంచి వచ్చింది..?


నోట్ల రద్దు వ్యవహారంలో బడా బాబులు ఎలా ఉన్నప్పటికీ.. సామాన్యులు, మధ్య తరగతి వర్గాలకు సమస్యగా మారింది. అసలు కొత్త నోట్లు దొరక్క తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. ఇప్పుడు ఐటీ షాక్ ఇచ్చింది. రద్దు వ్యవహారం తర్వాత ప్రతీ బ్యాంకులోని ఖాతాలను ఐటీ శాఖ పరిశీలిస్తోంది. ఇప్పటికే కొన్ని వేల ఖాతాల పరిశీలన ముగిసింది. మరిన్ని ఖాతాలను ఇంకా పరిశీలించే పనిలో ఉన్నారు.

అయితే, గతంలో ప్రతిసారి బ్యాంక్ ఖాతాలపై ఐటీ పరిశీలన చేయాల్సిందని నిబంధనలున్నా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు నోట్ల రద్దుతో ఆర్బీఐ ఆదేశాలతో ఐటీ ఇదే పనిలో పడింది. ప్రస్తుతం ఖాతాల నుంచి జరిగిన లావాదేవీలపై నోటీసుల్లోనే ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. కొన్ని ఏళ్లుగా డిపాజిట్ చేయకుండా ఉన్న ఖాతాల్లో ఒక్కసారిగా లక్షల రూపాయలు ఎలా బదిలీ చేశారని, ఎక్కడ నుంచి వచ్చాయని, వాటి సోర్స్ ఏమిటంటూ ప్రశ్నిస్తోంది. దీనిపై నోటీసులు అందుకున్న వారం రోజుల్లోనే సమాధానం ఇవ్వాలంటూ సూచిస్తోంది. అంతే కాకుండా రైతుల ఖాతాలుంటే వాటికి సంబంధించి పాసు పుస్తకాలు, వేసిన పంట, వచ్చిన దిగుబడి, ఎక్కడ అమ్మారో మార్కెట్ చిట్టీలు.. ఇలా ప్రతి విషయాన్ని వివరించాలని నోటీసుల్లోనే స్పష్టం చేస్తోంది.

వాస్తవంగా ప్రధాన వ్యాపారులు, కొంతమంది ఫైనాన్షియర్లు సామాన్యుల వ్యక్తిగత ఖాతాలను నోట్ల రద్దు సమయంలోనే వినియోగించుకున్నారు. ఖాతాల్లో పాతనోట్లు జమ చేయించారు. వారికి ఎంతోకొంత ముట్టచెప్పారు. జిల్లాలో జరిగిన వాస్తవ పరిస్థితి ఇది. అంతేకాకుండా వ్యవసాయ, రోజువారీ కూలీలు, వ్యాపారుల దగ్గర పనిచేసే వారు.. ఇలాంటి వారిని వినియోగించుకున్నారు. వారి ఖాతాల్లో లక్షలు బదిలీ చేయించారు. పాపం.. ఎంతో కొంత క మీషన్ వస్తుందని తమ ఖాతాల్లో లక్షలు బదిలీ చేసి వ్యాపారులు, ఫైనాన్షియర్లకు అప్పగించారు. కానీ.. ఇప్పుడు ఈ లావాదేవీలపై ఐటీ శాఖ కన్నేయడం, నోటీసులు ఇస్తుండటంతో ఆందోళన పడుతున్నారు. అంతే కాకుండా గతంలో ఎన్నడూ లేనంతగా ఒక్కసారే.. అది నోట్ల రద్దు తర్వాతే లక్షలు ఖాతాల్లోకి రావడంపై ఐటీ అనుమానాలు వ్య క్తం చేస్తూ ప్రశ్నల వర్షం కురిపిస్తోం ది.

మరోవైపు బ్యాం కర్ల నుంచి అన్ని ఖాతాల వివరాలు, ఇప్పటి వరకు చేసిన లావాదేవీలపై ఐటీ అధికారులు సేకరిస్తున్నారు. గతంలో ప్రతీ ఖాతాపై కన్నేయాల్సి ఉన్నప్పటికీ.. ఐటీ ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకుంది. కానీ ఇప్పుడు ఆర్బీఐ, కేంద్ర సర్కారు ఆదేశాలతో హడావుడిగా ఇదే పనిలో బిజీ అయ్యారు. దశల వారీగా ఖాతాలను పరిశీలిస్తున్నారు. ముందుగా రూ.10 లక్షలు దాటిన ఖాతాలు, తర్వాత రూ.5 లక్షలు, ఆ తర్వాత రూ.2.5 లక్షలు దాటిన ఖాతాలకు విడతలు వారిగా నోటీసులు జారీ చేస్తున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన వివిధ బ్యాంకుల ఖాతాదారులకు నోటీసులు అందాయి. బ్యాంకులతో సంబంధం లేకుండా పోస్టాఫీసుల ఐటీ శాఖాధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. ప్రస్తుతం రూ.10 ల క్షలు దాటి లావాదేవీలు నిర్వహించిన వారికి నోటీసు లు అందాయి. సుమారు 3 వేల మందికి పోస్టాఫీసు ల నుంచి నోటీసులు అందినట్లు చెబుతున్నారు.

ఇప్పుడెలా..?


నోటీసులు స్వీకరించిన ఖాతాదారులకు ఇప్పుడు భయం పట్టుకుంది. పాత నోట్లను వదిలించుకునేందుకు వెనకాముందు ఆలోచించక బ్యాంకుల్లో బదిలీ చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఈ వ్యవహారంలో ఐటీ శాఖ దిగడంతో మళ్లీ భయం పట్టుకుంది. వాస్తవంగా ప్రతి ఏటా బ్యాంకు ఖాతాలను పరిశీలించి రూ.3 లక్షలు దాటిన ఖాతాదారులకు ఐటీ రిటర్న్ దాఖలు చేయాలని నోటీసులు ఇవ్వాల్సి ఉంది. కానీ ఐటీ అధికారు లు వాటినేమీ పట్టించుకోలేదు. గద్వాల, ఆలూరు, అ లంపూర్, శాంతినగర్, అయిజ ప్రాంతాల్లోని వ్యాపారులకు ప్రస్తుతం నోటీసులు జారీ చేశారు.

అంతేకాకుండా నేడో, రేపో అన్ని బ్యాంకుల్లో ప్రతి ఖాతాదారునికి వారి లావాదేవీల వివరాలను అందిస్తూ.. లక్ష లు దాటిని వారికి పన్ను చెల్లింపులు చేయాలంటూ ఐ టీ నోటీసులు అందనున్నాయి. ఈ నేపథ్యంలో రోజువారి కూలీలు, సామాన్య, మధ్య తరగతివర్గాలకు ఐ టీ వ్యవహారం ఇబ్బందిగా మారింది దీంతో తమకు తెలిసిన అడిటర్లు, చార్టర్ అకౌంట్లను సంప్రదిస్తున్నా రు. కాగా ఐటీ నోటీసులు జారీ అవుతున్నాయని, అ యితే ఇన్‌కం సోర్సేస్ కచ్చితంగా వివరించాలని, వివరాలు అందిస్తే కొన్ని మినహాయింపులు ఉంటాయని, నోటీసులుకు సమాధానం ఇవ్వాలని జిల్లాకు చెందిన ట్యాక్స్ కన్సల్టేంట్ రాఘవేంద్రరెడ్డి చెబుతున్నారు.

78
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS