ఎన్ని అవాంతరాల్లో


Thu,January 12, 2017 01:43 AM

-అడుగడుగునా అడ్డంకులు
-నెట్టెంపాడు కింద పూర్తికాని 99వ ప్యాకేజీ
-కోర్టు కేసులతో ముందుకు సాగని పనులు
-పనుల సౌలభ్యం కోసం4 బిట్లుగా విభజన
-ఎంతకూ పూర్తికానివ్వని భూ సేకరణ తంతు
-రైతులను రెచ్చగొట్టి కోర్టులకు పంపుతున్న నేతలు
-36కిలో మీటర్లకుగాను మిగిలింది 6 కిలోమీటర్లే

నడిగడ్డ, నమస్తే తెలంగాణ : సాగునీటి ప రంగా వచ్చే వానాకాలం నాటికి నెట్టెంపాడు కిం ద పూర్తి స్థాయిలో ఆయకట్టుకు నీరందించేందు కు గాను ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్ష్యసాధనకు 99వ ప్యాకేజీ ప్రతిబంధకంగా మారడంతో ఇరిగేషన్ అధికారుల దృష్టంతా ఆ ప్యాకే జీ పైనే ఉంది. నెట్టెంపాడు కింద 2లక్షల ఎకరాలకు నీరందించేందుకు చేపట్టారు. నాలుగేళ్లు 20, 30వేల ఎకరాలకు మించి నీరందట్లేదు. రా ష్ట్ర ప్రభుత్వం గత వానాకాలంలో మొదటి సారి గా లక్ష ఎకరాలకు పైగా నీరందించి పంటల సా గుకు సహకరించింది.

మిగిలిన లక్ష ఎకరాలకు నీరందాలంటే.. 99 ప్యాకేజీ పూర్తయితే తప్ప సాధ్యం కాదు. అందుకు భూసేకరణ, కాంట్రాక్ట్ ఏజెన్సీల నిర్లక్ష్యం, కోర్టు కేసులు ముందుకు సా గనివ్వట్లేదు. నెట్టెంపాడు ప్రాజెక్టు అంచనా వ్య యం రూ.2,350 కోట్లు కాగా ఇప్పటి వరకు రూ.1,950 కోట్లు ఖర్చు చేశారు. 2005 డిసెంబర్ 5న మొదట గుడ్డెందొడ్డి జలాశయం పను లు మొదలయ్యాయి. ఏ ముహుర్తాన పనులు ప్రారంభమయ్యాయో గానీ అడుగడుగునా అ వాంతరాలు ఎదురవుతునే ఉన్నాయి. గత ప్ర భుత్వ పెద్దల అవినీతి, అక్రమాల వల్ల సంగాల, చిన్నోనిపల్లి జలాశయాలు మూలనబడ్డాయి.

ఈ ప్రాజెక్టులో భూసేకరణ ప్రధాన సమస్యగా మా రింది. పనుల సౌలభ్యం కోసం 99 ప్యాకేజీని ఏబీసీడీగా విభజించి ఏజెన్సీలకు పనులు అప్పగించారు. ఈ పనులు తీసుకున్న కాంట్రాక్టర్లను అప్పటి పెద్దలు కొందరు పర్సంటేజీ కోసం వే ధించడం వల్ల కొందరు కాంట్రాక్టర్లు మధ్యలో నే పనులను వదిలేసి వెళ్లారు. టీఆర్‌ఎస్ ప్ర భుత్వం రాగానే నెట్టెంపాడు పై ప్రత్యేక దృష్టి సా రించింది. నెట్టెంపాడులో నెలకొన్న చిక్కుముడులను విడదీస్తూ గత వానాకాలంలో లక్ష ఎకరాలకు నీరందించింది. నెట్టెంపాడు భూసేకరణలో రాజకీయ నాయకుల, వారి అనుచరుల, కొంద రు న్యాయవాదుల జోక్యం, సాగునీటి, భూసేకరణ శాఖాధికారుల మధ్య సమన్వయ లోపం వెరసి 99 ప్యాకేజీని ముందుకు సాగనివ్వట్లేదు. 99 ప్యాకేజీలోని 99 ఏలో 404.68 ఎకరాలు కావాల్సి ఉండగా ఇప్పటి వరకు 392.35 ఎకరాలు సేకరించారు. ఇంకా 12.33 ఎకరాలు సేకరించాల్సి ఉంది.

99బీలో 588.94 ఎకరాలకు గాను 371.85 ఎకరాలు సేకరించగా ఇం కా 217.85 ఎకరాల భూమి అవసరం. 99సీకి 139.13 ఎకరాలు అవసరం కాగా 123.33 ఎ కరాల భూమిని సేకరించారు. ఇంకా 15.08 ఎ కరాలు సేకరించాల్సి ఉంది. 99డీకి 159.84 ఎ కరాలకు 112.48 ఎకరాల సేకరణ జరగగా! ఇంకా 47.36 ఎకరాల భూమి కావాల్సి ఉంది. ఆయా విభాగాలలో భూసేకరణ ప్రతిబంధకం గా మారింది. 99 ప్యాకేజీ కింద 60 వేల ఎకరాలకు నీరందాల్సి ఉంది. నెట్టెంపాడు కంటే 11 ఏళ్ల తర్వాత చేపట్టిన పాలమూర్-రంగారెడ్డి పథకంలో భూసేకరణ దాదాపుగా పూర్తి కావస్తున్నందున పథకం పనులు శరవేగంగా సాగుతున్నా యి. దీనిని బట్టి ఆంధ్రా పాలకుల ప్రభుత్వానికి, మన రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడ ఏమి టో స్పష్టమౌతోంది. పాలమూర్-రంగారెడ్డి పథకం కింద నిర్వాసితులకు ఆశించిన మేర నష్టపరిహారం చెల్లించడంతో స్వచ్ఛందంగా భూములను ఇచ్చారు. నెట్టెంపాడులో అందుకు భిన్నం గా భూసేకరణ వ్యవహారం సాగుతోంది.

గత ప్ర భుత్వం నెట్టెంపాడు కింద భూములు కోల్పో యే నిర్వాసితులకు వన్‌టైమ్ సెటిల్‌మెంట్ కిం ద నష్టపరిహారం అందించగా ఆ నష్టపరిహారం సరిపోవట్లేదని వన్‌టైమ్ సెటిల్‌మెంట్ కింద ఇచ్చిన నష్టపరిహారాన్ని తీసుకోకుండా కొందరు రైతులు కోర్టులకు వెళ్లారు. రైతులతో కేసులు వే యించిన కొందరు రాజకీయ నాయకులు, న్యాయవాదులు కింది కోర్టుల్లో కేసులు వేయించారు. ఏళ్లు గడిచినా తీర్పులు రానందున భూసేకరణకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని కింది కోర్టులు సమర్తించడాన్ని జీర్ణించుకోలేని కొందరు న్యాయవాదులు సుప్రీం కో ర్టులో వేశారు. భూసేకరణ అధికారులు సుప్రీం కోర్టు, హైకోర్టు, కింది కోర్టుల చుట్టూ తిరుగుతూ నే ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వ చ్చే వానాకాలం నాటికి కూడా 99ప్యాకేజీ పూర్తవుతుందనే ఆశ రైతుల్లో లేదు. 36 కిలో మీటర్ల పొడవు కల్గిన 99ప్యాకేజీ కింద ఇప్పటి వరకు 30కిలో మీటర్ల మేర పనులు పూర్తయ్యాయి.

మిగిలిన 6కిలో మీటర్ల పనులు వచ్చే జూన్, జూ లై నాటికి పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని నె ట్టెంపాడు ఈఈ చక్రధర్ తెలిపారు. ఈ ప్యాకేజీ కింద జీరో నుంచి 18 కిలో మీటర్లలో 34 బ్రిడ్జి లు, 18 నుంచి 27 కిలో మీటర్ల మధ్య 25 బ్రిడ్జి లు, 27కిలో మీటర్ల నుంచి 36 కిలో మీటర్ల మ ధ్య 21 బ్రిడ్జిలు ఉన్నాయన్నారు. ఇప్పటి వరకు 21 బ్రిడ్జిలు పూర్తయినట్టు ఆయన తెలిపారు. రై ల్వే క్రాసింగ్ కింద వెళ్లే బ్రిడ్జిల కోసం రైల్వే శా ఖకు కోరిన డబ్బు డిపాజిట్ చేసినట్లు తెలిపారు. గద్వాల మండలం కొండపల్లి గ్రామానికి వెళ్లే 99డీ కింద బ్రిడ్జి నిర్మాణం పనులు సాగుతున్నాయని, కొందరు రైతులు కోర్టులకు వెళ్లడం వల్ల ఈ ప్యాకేజీ పనులకు విఘాతం ఏర్పడిందని చ క్రధర్ వివరించారు. 99 ప్యాకేజీ కాల్వలు జిల్లాలోని ధరూరు, మల్దకల్, గద్వాల మండలాల గుండా ఇటిక్యాల మండలం వరకు వెళ్తుంది.

274
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS