ఫిషరీస్ కళాశాల మంజూరు


Thu,January 12, 2017 01:42 AM

-మాట నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్
-వచ్చే జూన్‌లో తరగతులు ప్రారంభం
-రూ.86 కోట్లతో కళాశాల ఏర్పాట్లు

వనపర్తి, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి : వనపర్తి జిల్లాలోని పెబ్బేరు మండల కేంద్రానికి ఫిషరీస్ సైన్స్ కళాశాలను మం జూరు చేస్తూ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. ఈ మేరకు జీవో.ఎంఎస్ నంబర్ 02 ను విడుదల చేసింది. రాష్ట్రంలో రెండు కళాశాలలను ఏర్పాటు చేస్తామని సీఎం ఇచ్చిన మాటకు కట్టుబడి కళాశాలలను మంజూరు చేశారు. గోదావరి, కృష్ణా నదులను అనుసరించి ఆయా ప్రాం తాల్లో రెండు ఫిషరీస్ సైన్స్ కళాశాలల ఏర్పాటుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఇందులో రాష్ట్రంలోనే మొట్టమొదటి సారిగా ఫిషరీస్ సైన్స్ కళాశాలను వనపర్తి జిల్లాకు మంజూరు చేయించేందుకు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఇందుకు అవిభక్త మహబూబ్‌నగర్ జిల్లాల్లో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ఫిషరీస్ సైన్స్ కళాశాలను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపి ప్రత్యేక జీవో నెంబర్ 02ను విడుదల చేసింది.

మాట నిలబెట్టుకున్న సీఎం..


ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఫిషరీస్ సైన్స్ కళాశాలను మంజూరు చేసి మాట నెలబెట్టుకున్నారు. 2015 జూన్ 11న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం శంకుస్థాపన సం దర్భంగా భూత్పూరు మండలంలోని కర్వెనలో జరిగిన కార్యక్రమంలో హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సింగిరెడ్డి నిరంజన్‌రె డ్డి వ్యవసాయ కళాశాల, పిషరీస్ కళాశాలల మంజూరు కోసం సీ ఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై అప్పట్లోనే వ్యవసాయ కళాశాల ఏ ర్పాటును ప్రకటించిన సీఎం, ఫిషరీస్ కళాశాలను ఏడాదిలోగా మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అనుకున్నట్లుగా బుధవారం రాష్ట్ర కేబినెట్‌లో ఆమోదం తెలిపి పెబ్బేరుకు మంజూరు చేయడం తో మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా, మరో కళాశాలను కూడా గోదావరి నదిని అనుసరించి అక్కడి ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉంది.

రూ.86 కోట్లతో మంజూరు..


పెబ్బేరులో ఏర్పాటు చేస్తున్న ఫిషరీస్ కళాశాల నిర్మాణానికి ప్రభుత్వం రూ.86 కోట్ల 38 లక్షలను మంజూరు చేసింది. ఈ మేరకు ఈ ఏడాది జూన్‌లో తరగతులను ప్రారంభిస్తుండగా, మొదటి సంవత్సరానికి రూ.33 కోట్లు కేటాయించింది. అలాగే రెండో సంవత్సరంలో రూ.30 కోట్ల 63 లక్షలు, మూడో సంవత్సరంలో రూ.7కోట్ల 6 లక్షలు, నాల్గో సంవత్సరంలో రూ.7 కోట్ల 46 లక్షలు, ఐదో సంవత్సరంలో రూ.8 కోట్ల 21 లక్షలను కేటాయించింది. వచ్చే విద్యా సంవత్సరంలో పెబ్బేరులోని జూరాల క్వార్టర్స్‌లో తాత్కాలికంగా కళాశాలను ఏర్పాటు చేసి, నూతన కళాశాలను నిర్మాణం చేపట్టనున్నారు. నూతన కళాశాల నిర్మాణం కోసం ఇప్పటికే 25 ఎకరాల్లో స్థలాన్ని కేటాయించడం జరిగింది.

జోగుళాంబ గద్వాల, వనపర్తి జిల్లాలకు అనువుగా..


నూతనంగా ఏర్పాటు చేసిన ఫిషరీస్ సైన్స్ కళాశాలను వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాలకు అనువుగా ఉండేలా పెబ్బేరులో ఏ ర్పాటు చేస్తుంది. జాతీయ రహదారిని అనుసరించి ఉన్న పెబ్బేరు మండల కేంద్రం అన్ని ప్రాంతాలకు అనువుగా ఉంటుంది. నూతనంగా కేబినెట్ ఆమోదం తెలిపిన ఫిషరీస్ సైన్స్ కళాశాలను రెండు జిల్లాలకు అనువుగా ఉన్న పెబ్బేరులో ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉ పాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి సూచనతో ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటు చేయబోతుంది. వివిధ శాఖల వారీగా మంజూరవుతున్న అభివృద్ధి పథకాలు ఇలా అన్ని ప్రాంతాలకు సమానంగా అన్నట్లుగా ప్రభు త్వ కేటాయింపులు నిలుస్తున్నాయి.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS