నూతన ఆవిష్కరణలకే ఇన్‌స్పైర్ అవార్డులు


Thu,January 12, 2017 01:41 AM

గద్వాల న్యూటౌన్ : పిల్లల సృజనాత్మకశక్తిని వెలికి తీసి వారిలో నూతన ఆవిష్కరణలు పెంపొందించేందుకే ఇన్స్‌స్పైర్ మనాక్ అవార్డులు దోహదపడుతాయని జోగుళాంబ గద్వాల జిల్లా సైన్స్ ఆఫీసర్ భాస్కర్ పాపన్న పేర్కొన్నారు. జిల్లాలోని బాలభవన్‌లో బుధవారం ఇన్స్‌స్పైర్ మనాక్ అవార్డులపై అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల సైన్స్ టీచర్లకు ఒక రోజు అవగాహన సదస్సును నిర్వహించారు. ఎం ఈవో ప్రతాప్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డీఎస్‌వో భాస్కర్ మాట్లాడుతూ విద్యార్థులకు తెలుసుకున్న విషయాన్ని కొత్త ఆలోచనలతో బయటికి వచ్చేలా సైన్స్ ఉపాధ్యాయులు తయారు చేయాలన్నారు. సైన్స్‌లో ప్రతి అంశం పనికొచ్చే విధంగా విద్యార్థులను పైస్థాయిలో ప్రోత్సహించాలన్నారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి మరింత పదునుపెట్టాలన్నారు. ప్రతిభను కనబరిచే విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వ రీసెర్చ్ కింద సహాయం అందజేస్తుందన్నారు. అయితే ఈ అవార్డుల కొసం ఆన్‌లైన్‌లో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని? నామినేషన్ ఎలా పూర్తి చేయాలని, పిల్లలు, వారి తల్లిదండ్రులు లేదా సంరక్షుల పూర్తి వివరాలను పొందుపర్చే విధానాన్ని పవర్‌పాయింట్ ప్రాజెక్టర్ ద్వారా వివరించారు. కార్యక్రమంలో జీహెచ్‌ఎంలు నర్సింహస్వామి, వరలక్ష్మీ, జిల్లా సైన్స్‌ఫోరం సభ్యులు నాగేష్‌బాబు, నాగమద్దిలేటిలు, సైన్స్ టీచర్లు పాల్గొన్నారు.

284
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS