ఘనంగా ఫుడ్ ఫెస్టివల్


Thu,January 12, 2017 01:37 AM

గద్వాల న్యూటౌన్ : జిల్లా కేంద్రం లోని దుర్గాబాయి దేశ్‌ముఖ్ మహిళా డిగ్రీ కళాశాలలో సంక్రాంతి వేడుకలను పురస్కరించుకుని బుధవారం కళాశాల విద్యార్థినులు ఘనంగా ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. 40 రకాల పిండి పదార్థాలు, నోరూరించే ఆహారపు వంటకాలు తయారు చేసిన విద్యార్థినులు ఈ ఫెస్టివల్ కార్యక్రమంలో ప్రదర్శించారు. శరీరానికి శక్తినిచ్చే ప్రోటీన్స్, ఐరన్, విటవిన్స్, కార్బోహైడ్రేట్స్ తదితర పోషకాలతో కూ డిన వంటకాలను తయారు చేసి ఆకట్టుకున్నారు. ప్రధానంగా కాకరకాయ వేపు డు, ఫ్రూట్ సలాడ్, ఆల్ విజిటేబుల్ బిర్యాని, రాగి అంబలి, పెరుగుతో తయా రు చేసిన రాగి ముద్ద, నవధాన్యాల లడ్డు, అరిసెలు, మోదీ ఐటం, మొలకెత్తే విత్తనాలు, రవ్వలడ్డు, జొన్న సంకటి, నువ్వు ల రొట్టెలు, కరివేపాకు బిర్యాని, బీట్రూ ట్, క్యారెట్ హల్వా, ముల్లంగి పాయసం, మిక్సింగ్ విజిటేబుల్ చపాతి, పాలక్ పన్నీర్, సగ్గు పాయసం, సున్ని ఉండలు మొదలైన పదార్థాలు తయారు చేసి విద్యార్థినులు ఔరా అనిపించారు.

విద్యార్థినులు తయారు చేసిన వంటకాలను కళాశాల ప్రిన్సిపాల్ సరస్వతీతో పాటు కళాశాల అధ్యాపకులు రుచి చూశారు. నోరూరించే వంటకాలు తయారు చేసిన విద్యార్థినులను బహుమతులతో అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ సరస్వతి మాట్లాడుతూ ఎప్పటికీ చదువులతో కుస్తీపడుతూ ఉండడటమే కాకుం డా ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం పట్ల వంటల తయారీపై కూడా విద్యార్థినులకు అవగాహన ఏర్పడుతుందన్నారు. కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ సరస్వతీ సుధాకర్, అధ్యాపకులు వినయ్, ఎల్లస్వామి, సురేష్, కిరణ్, పుష్ప, అరుణజ్యోతి తదితరులు పాల్గొన్నారు.

272
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS