రాష్ట్ర స్థాయి పోటీలకు మార్లబీడు విద్యార్థులు


Thu,January 12, 2017 01:36 AM

ధరూర్ : రాష్ట్ర స్థాయి వాలీబాల్, హైజంప్ పోటీల విభాగంలో జోగుళాంబ గద్వాల జిల్లా నుంచి రాష్ట్రస్థాయి పోటీలకు మార్లబీడు జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికైనట్లు హెచ్‌ఎం సురేష్ కుమార్, పీఈటీ మోహన్‌లు తెలిపారు. ఎస్‌జీఎఫ్ క్రీడా విభాగంలో రాజు, అండర్-14 విభాగంలో హైజంప్‌లో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. అదే విధంగా రాజీవ్ ఖేలో అభియాన్ అండర్-14లో వాలీబాల్ పోటీలకు బాలికల విభాగంలో భువనేశ్వరి, బాలుర విభాగంలో రాజులు ఎంపికయ్యారు. పాఠశాల ఉపాధ్యాయులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఈ సందర్భంగా విద్యార్థుల్ని అభినందించారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS