కమిషనర్‌పై ఆరోపణలు చేయడం దారుణం


Thu,January 12, 2017 01:36 AM

గద్వాలటౌన్: మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తున్న మున్సిపల్ కమిషనర్‌పై కౌన్సిల్ మొత్తం మూకుమ్మడిగా ఆరోపణలు చేయడం దారుణమని టీడీపీ గద్వాల నియోజకవర్గ ఇన్‌చార్జి గంజిపేట రాములు అన్నారు. పార్టీ కార్యాలయంలో బుధ వారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెగ్యులర్ కమి షనర్ కౌన్సిల్ ఆగడాలు సాగవన్న ఉద్దేశంతోనే కమిషనర్‌పై ఎదురుదాడికి కౌన్సిల్ పాల్పడుతోందని విమర్శించారు. కౌన్సిల్ తీరు కారణంగా పట్టణం అభివృద్ధికి నోచుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా అధికారులపై వేధింపులు మాని పాలనపై దృష్టి సారించాలని సూచించారు. లేని పక్షంలో ప్రజలు సరైన బుద్ది చెప్పక తప్పదని హెచ్చరించారు. సమావేశంలో టీడీపీ నాయకులు చిత్తారి కిరణ్, రాంబాబునాయు డు, ఆంజనేయులు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS