స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలి


Thu,January 12, 2017 01:35 AM

గట్టు : నేటి యువత స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకుని మంచి మార్గంలో నడవాలని ఎంఈవో కొండారెడ్డి, తుమ్మలచెర్వు యూపీఎస్ హెచ్‌ఎం ఆంజనేయులు పేర్కొన్నారు. వివేకానంద 154వ జయంతిని మాచర్ల, తుమ్మలచెర్వు పాఠశాలల్లో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంఈఓ, హెచ్‌ఎంలు మాట్లాడుతూ యువత స్వామి అనుసరించిన మార్గంలో పయనిస్తే జీవితాన్ని ఆదర్శప్రాయంగా చేసుకోవచ్చన్నారు. మాచర్ల పాఠశాలలో విద్యార్థులకు ఉపన్యాస, వ్యాసరచన, పాటల పోటీలు నిర్వహించి విజేత విద్యార్థులకు బహుమతులను హెచ్‌ఎం నర్సింహులు అందచేశారు. తుమ్మలచెర్వు పాఠశాలలో ఉపన్యాస, చిత్రలేఖన, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో పాఠశాల ఉపాధ్యాయులు, వలంటీర్లు జాకీర్‌హుసేన్, నాగరాజు, వెంకట్‌రెడ్డి, ఇర్ఫానా పిరదౌస్, కవిత, రేణుక, అరుణ, నరేశ్, తిమ్మప్ప, అరవింద్, కృష్ణదేవరాయలు, భీమన్న, తిప్పన్న, ఇంజన్న, రాజుసాగర్ తదితరులు పాల్గొన్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS