విద్యార్థులకు పోటీలు


Thu,January 12, 2017 01:35 AM

ధరూర్ : మండలంలోని ఉప్పేరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో బుధవారం టీపీయూఎస్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన, వకృత్వపోటీలు నిర్వహించారు. పోటీల్లో నరేష్ కుమార్, రామేశ్వరి, ద్వితీయ స్థానంలో గాయత్రి, సంగీత, తృతీయ స్థానంలో శిరీష ,రాజ్వేశ్వరిలు గెలుపొందారు. వీరికి గద్వాల వివేక్ బుక్ వరల్డ్ యజమాని భీమన్న బహుమతులు ప్రదానం చేశారు. ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వరరెడ్డి చేతుల మీదుగా,బహుమతులు అందజేశారు. వివేకానందుడి ఆశయాలను సాధించాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో టీపీయూస్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మల్దకల్ : స్వామి వివేకానంద 154వ జయంతి పురస్కరించుకొని ఏబీవీపీ అధ్వర్యంలో బుధవారం కళాశాల, జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులకు ఆటల పోటీలను నిర్వహించారు. విజేతలకు కళాశాల ప్రిన్సిపాల్ రాజాశేఖర్, పీడీ జితేందర్లు బహుమతులు అందజేశారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ క్రీడలతో పాటు విద్యలో కూడ ప్రతిభను కనబర్చాలని సూచించారు. కార్యక్రమంలో గద్వాల్ తాలుకా బాగ్ కన్వీనర్ నాగరాజు, మండల కన్వీనర్ కురుమూర్తి, రాఘవేంద్ర, తిరుమలేశ్, మహేస లక్ష్మన్న, తదితరులు పాల్గొన్నారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS