పల్లెల్లో స్వచ్ఛభారత్

Thu,January 12, 2017 01:34 AM

గట్టు : గట్టు, కాలూర్‌తిమ్మన్‌దొడ్డి మండలాల్లో స్వచ్ఛభారత్ సందడి బుధవారం కనిపించింది. కేటీదొడ్డి మండలంలోని నందిన్నెలో సర్పంచ్ భీమరాయుడు, పంచాయతీ కార్యదర్శి మస్తాన్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్యం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడక్కడ ఉన్న మురుగును తొలగింప జేశారు. తప్పెట్లమొర్సులో పారిశుద్ధ్యం పనులను చేపట్టారు. కార్యక్రమంలో సర్పంచ్ బొజ్జమ్మ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గద్వాల తిమ్మప్ప, పంచాయతీ కార్యదర్శి మస్తాన్ పాల్గొన్నారు. బలిగేరలో కూడా స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక సర్పంచ్ సామేల్, టీఆర్‌ఎస్ నాయకుడు బలిగేర హనుమంతు ఆధ్వర్యంలో పరిసరాలను పరిశుభ్రం చేశారు. సర్పంచ్ సామేల్ స్వయంగా తానే రంగలోకి దూకి డ్రైనేజీలోని పూడికను తీసి అందరినీ ఉత్సాహపరిచారు.

31
Tags

More News

మరిన్ని వార్తలు...