నగదు రహితంపై అవగాహన


Thu,January 12, 2017 01:34 AM

ధరూర్ : నగదు రహితంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని గద్వాల విశ్వం కంప్యూటర్స్ సీఈవో పత్తి శ్రీధర్ పేర్కొన్నారు. జిల్లా అధికారుల సూచనల మేరకు బుధవారం ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ ,రెవెన్యూ కార్యదర్శులు,ఉపాధి సిబ్బంది,ఐకేపీ సిబ్బందికి,వివిధ శాఖల అధికారులకు నగదు రహిత లావాదేవీలపై శ్రీధర్ అవగాహన కల్పించారు. భవిష్యత్ అంతా డిజిటల్ విధానంతో చెల్లింపులు ఉంటాయన్నారు. ప్రధానంగా మహిళా గ్రూపులు, ఉపాధి కూలీలు, వ్యవసాయదారులకు అవగాహన కల్పించాలని కోరారు. వ్యాపారస్తులు సైతం బ్యాంకులకు స్వైప్ మిషన్‌ల కోసం దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. ఎంపీడీవో నర్సింహ్మ నాయుడు, తహసీల్దార్ సమద్, ఏపీఎం సలోమీ, ఏపీవో అనిల్ కుమార్, ఈవోపీఆర్‌డీ రవీందర్ పాల్గొన్నారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS