ఉత్సాహంగా జాగృతి క్రికెట్ టోర్నీ


Thu,January 12, 2017 01:33 AM

మహబూబ్‌నగర్ స్పోర్ట్స్ : తెలంగాణ జాగృతి యువత విభాగం ఆధ్వర్యంలో ఎంవీఎస్ కళాశాల మైదానంలో జిల్లాస్థాయి జాగృతి మెగా క్రికెట్ టోర్నీ ఉత్సాహంగా సాగుతున్నాయి. బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో గద్వాల క్రికెట్ క్లబ్ జట్టు 17 పరుగుల తేడాతో వనపర్తి లయన్స్ క్లబ్ జట్టుపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన గద్వాల జట్టు 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన వనపర్తి జట్టు 10 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 60 పరుగులు చేసింది. నేడు స్టేడియం మైదానంలో లీగ్ ఫైనల్‌లో గద్వాల క్రికెట్ క్లబ్-జడ్చర్ల ఫ్రెండ్ యూత్ జట్ల మధ్య జరగనుంది. విజేతకు రూ.30వేలు, రన్నర్ జట్టుకు రూ.15 వేలు నగదు పారితోషికం అందజేస్తారు. అంతకు ముందు మ్యాచ్‌లను తెలంగాణ జాగృతి అధికార ప్రతినిధి లక్ష్మీనారాయణ్‌యాదవ్ పోటీలను ప్రారంభించారు.కార్యక్రమంలోయువత విభాగం అధ్యక్షుడు అరవింద్ ,చీర్ల సత్యం,చింతలయ్య, శివప్రసాద్,రఘు తదితరులు పాల్గొన్నారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS