వికలాంగులకు వీల్‌చైర్ల పంపిణీ

Thu,January 12, 2017 01:33 AM

గట్టు : మండల కేంద్రంలో బుధవారం వికలాంగులకు వీల్ చైర్లను జెడ్సీటీసీ శ్యామల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వికలాంగులను సకలాంగులతో సమానంగా చూడాలన్నారు. మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో కమిట్‌మెంట్స్, చాయ్ సహకారంతో ఆరగిద్ద, పెంచికలపాడు గ్రామాలకు చెందిన వికలాంగ చిన్నారులు శృతి, విజయలక్ష్మీ, మౌలాలిలకు వీల్‌చైర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వికలాంగులు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి తహసీల్దార్ రాజు, మండల పరిషత్ సూపరింటెండెంట్ నాగేశ్వర్‌రావు, ఐకేపీ ఏపీఎం భీమన్న, కమిట్‌మెంట్స్ కోఆర్డినేటర్ జ్ఞానేంద్రాచారి, మండల కోఆర్డినేటర్ తాయన్న, వికలాంగుల సమాఖ్య మండల అధ్యక్షుడు ప్రాణేశ్ పాల్గొన్నారు.

24
Tags

More News

మరిన్ని వార్తలు...