ఉపాధి అవకాశాలు కల్పించడంలో విఫలం


Thu,January 12, 2017 01:33 AM

గద్వాల,నమస్తేతెలంగాణ: విద్య,ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య రాష్ట్ర సహాయకార్యదర్శి వినయ్‌కుమార్ ఆరోపించారు. మంగళవారం జోగుళాంబ గద్వాలజిల్లాలోని సీఐటీయూ కార్యాలయంలో జరిగిన సమావేశానికి ముఖ్యఅథితిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వం వివిధ శాఖల్లో ఉన్న ఖాళీలు భర్తీ చేయకుండా కాలయాపణ చేస్తున్నారని విమర్శించారు. నిరుద్యోగులకు విద్య ,ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. అనంతరం జోగుళాంబ గద్వాల జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా రఫీ , ప్రధానకార్యదర్శిగా ఉప్పే రు నర్సింహా , ఉపాధ్యక్షులుగా శివ , శీలన్న , శ్రీనివాస్ , సహాయకార్యదర్శులగా హన్మంతు, రామకృష్ణ, మహబూబ్‌పాషా, సభ్యులుగా శేఖర్ ,భీమేష్ ,సంజయ్ ,రమేష్ ,సూరిబాబు ,ఆనంద్‌లను ఎన్నుకున్నారు.

25
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS