పేకాటరాయుళ్ల అరెస్టు


Thu,January 12, 2017 01:32 AM

గద్వాల క్రైం : గద్వాలలోని అయిజ రోడ్డు లారీ ట్రాన్స్‌పోర్టు సమీపంలో పేకాటాడుతున్న 6 గురిని బుధవారం రాత్రి అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్టు గద్వాల టౌన్ ఎస్‌ఐ శ్రీనివాస్ చెప్పారు. వీరి నుంచి రూ. 2 వేల నగదును స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించామన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరైనా పాల్పడితే శాఖాపరమైన చర్యలు తప్పవని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు.

26
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS