కార్మికులకు భద్రత కల్పించాలి


Wed,January 11, 2017 02:30 AM

గద్వాల,నమస్తేతెలంగాణ: భవన నిర్మాణ కార్మికులకు భద్రత కల్పించాలని భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్రప్రధాన కార్యదర్శి కోటంరాజు ఆరోపిం చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల భవన నిర్మాణ కార్మికులకు భధ్రత లేకుండా పోయిందని ఆరోపించారు. మంగళవారం పట్టణంలోని భవన నిర్మాణ కార్మిక సంఘం భవనంలో జిల్లా ప్రథమ మహాసభ రాష్ట్ర నాయకులు కోటేష్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైనా కోటం రాజు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల కోసం ఏర్పాటు చేసిన సంక్షేమ బోర్డు నిధులు కార్మికుల కోసమే ఖర్చు చేయాలని డిమాండ్ చేశా రు. భవన నిర్మాణ సంఘం పోరాటాల ఫలితంగా ఇన్సూరెన్స్, గుర్తింపు కార్డులు తదితర సౌకర్యాలు సాధించుకున్నామని తెలిపారు. పోరాటాలతోనే 2009లో కార్మికులకు వెల్ఫేర్‌బోర్డు ఏర్పాటు చేశారని తెలిపారు.

సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వెంకటస్వామి మాట్లాడుతూ మరణించిన కార్మికుల కుటుం బాలకు , ప్రసూతి అయిన మహిళలకు ఇచ్చే పరిహారం సంవత్సరాల తరబడి పెండింగ్‌లో ఉంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా లేబర్ అధికారి మహేష్ మాట్లాడుతూ జిల్లాలో 20వేల మంది కార్మికులు ఉండగా వెల్ఫేర్‌బోర్డులో 5వేల మంది సభ్యులు గా ఉన్నారని తెలిపారు. కార్మికులు క్రమం తప్పకుండా ఇన్సూరెన్స్ రెన్యూవల్ చేసు కోవాలని కోరారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కోటేష్, ప్రధానకార్యదర్శిగా ఏబు, ఉపాధ్యక్షులుగా మురళి , గోవిందమ్మ, శివన్న, కార్యదర్శులుగా పాటన్న, రామస్వామి, లతతో పాటు 17మందిని ఎన్నుకున్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS