సజావుగా గట్టు గ్రామసభ

Wed,January 11, 2017 02:30 AM

గట్టు: గట్టు గ్రామసభ మంగళవారం సర్పంచ్ సంతోషమ్మ అధ్యక్షతన నిర్వహించారు. పలు తీర్మానాలను సమావేశంలో పొందుపరిచారు. పారిశుధ్యం కోసం ఇంకుడు గుంతలను నిర్మించాలని తీర్మానించారు. డంపింగ్‌యార్డుతోపాటు శ్మశాన వాటిక గురించి సభ ఆమోదం తెలిపింది. మురుగునీటిని బయటకు పారిస్తున్న పలువురికి నోటీసులు ఇవ్వడంపై సభ్యులు అంగీకారం తెలిపారు. అదేవిధంగా నగదు రహితంపై అందరూ శ్రద్ధ వహించాలని సభ తీర్మానం చేసింది. కార్యక్రమంలో ఉప సర్పంచ్ పద్మమ్మ, పంచాయతీ కార్యదర్శి శివశంకర్, గ్రామస్థులు తదితరులు హాజరయ్యారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...