ఉత్సాహభరితంగా సందెరాళ్ల పోటీలు

Wed,January 11, 2017 02:30 AM

ధరూర్ : మండలంలోని నెట్టెంపాడు గ్రామంలో గోకారమయ్య ఉర్సు ఉత్సవాలను పురస్కరించుకొని వైస్ ఎంపీపీ వెంకట్రాంరెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం సందెరాళ్ల పోటీలను నిర్వహించారు. వివిధ గ్రామాల నుండి యువకులు హాజరై ఉత్సాహంగా పోటీలలో పాల్గొన్నారు. ప్రథమ భహుమతి విజేతకు వైస్ ఎంపీపీ వెంకట్రాం రెడ్డి రూ. 5,106, రెండవ బహుమతి విజేత బషీర్‌కు,రంగస్వామిలు రూ .3016లు, టీఆర్‌ఎస్ నేత తిమ్మారెడ్డి, మూడవ బహుమతి విజేతకు రూ 2,106లను బహుకరించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

28
Tags

More News

మరిన్ని వార్తలు...