నగదు రహిత లావాదేవీలపై అవగాహన


Wed,January 11, 2017 02:30 AM

గద్వాల,నమస్తేతెలంగాణ: మండల పరిధిలోని రేకులపల్లి గ్రామంలో భారతీయస్టేట్‌బ్యాంక్ వారు నగదు రహిత లావాదేవీలపై ప్రజలతో పాటు రైతుల కు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంక్ అధికారి చంద్రశేఖర్‌రావు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ నగదు రహిత లావాదేవీలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. పీవోఎస్ మిషన్ల ద్వారా లావాదేవీలు బ్యాంక్‌లు జరుపుతున్నాయని వాటిని రైతులు సద్వివినియోగం చేసుకోవాలని చెప్పారు. ప్రతి ఒక్కరు బ్యాంక్ అకౌంట్ తెరుచుకుని దానికి ఆధార్ ,మోబైల్ నంబర్ అనుసంధానం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో బ్యాంక్ సిబ్బంది, ఎంపీటీసీ శివకుమార్ సర్పంచ్ సుజాతమ్మ తదితరులు పాల్గొన్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS