సీఎల్‌లు మంజూరు చేయాలి


Wed,January 11, 2017 02:30 AM

ధరూర్ : గతేడాది సంక్రాంతి సెలవులో ప్రభుత్వ ఆదేశాల మేరకు, జనాభా కుటుంబ అప్‌డేషన్‌లో పాల్గొన్న ఉపాధ్యాయులకు ప్రత్యేక సెలవు దినాలు ప్రకటించాలని టీపీఆర్‌టీయు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హంపయ్య ఆధ్వర్యంలో విద్యాధికారి నరేష్ కుమార్‌కు మంగళవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా హంపయ్య మాట్లాడుతూ సెలవు దినాలు ఉన్నప్పటికీ ఎన్‌పీఆర్ విధులు నిర్వర్తించి పూర్తి చేయడం జరిగిందన్నారు. ఏడాది గడిచినా వీటికి సంబంధించిన సెలవులు ఇవ్వలేదని, దీనిపై ప్రభుత్వానికి నివేదించాలని వినతి పత్రంలో కోరారు. కార్యక్రమంలో మండల నాయకులు ఆంజనేయులు, ఉమామహేశ్వర్, సీతంనాయుడు, సుజాత తదితరులు పాల్గొన్నారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS