పీహెచ్‌సీలకు కొత్త సొబగులు


Wed,January 11, 2017 02:30 AM


గట్టు : జోగుళాంబ గద్వాల జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పీహెచ్‌సీ) రంగుల సొబగులతో అందంగా మారనున్నాయి. జిల్లాలో గట్టుతోపాటు ధరూర్, మల్దకల్, అయిజ, ఇటిక్యాల, మానవపాడు, ఉప్పేరు, వడ్డేపల్లి, క్యాతూర్‌లలో పీహెచ్‌సీలు ఉన్నాయి. హెచ్‌డీఎస్ నిధులు జిల్లా పీహెచ్‌సీల ఖాతాల్లోకి చేరాయి. జిల్లాలోని ఒక్కో పీహెచ్‌సీకి రూ.87,500 మంజూరయ్యాయి. అయితే ఈ నిధులతో పీహెచ్‌సీలకు రంగులు వేయించాలని వైద్యారోగ్యశాఖ కమిషనర్ నుంచి జిల్లా వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు వచ్చాయి. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువాత మొదటిసారిగా రంగులు వేయిస్తుండడంతో ప్రభుత్వ సూచనల ప్రకారం అధికారులు కూడ రంగుల ఎంపికపై కూడ ప్రత్యేక శ్రద్ధ వహించారు. ఎంపిక చేసిన లైట్ గ్రీన్, డార్క్ గ్రీన్‌తోపాటు కింది బార్డరులో బూడిద రంగు వేయించాలని నమూనాను పంపించారు.

ఈ మేరకు జిల్లాలోని అన్ని పీహెచ్‌సీల సిబ్బంది తమ పీహెచ్‌సీలకు రంగులు వేయించడంతోపాటు దవాఖానల్లో వసతుల కల్పనకు కూడా పూనుకుంటున్నారు. మొత్తంమీద ఎంపిక చేసిన రంగులు ఆకర్షించే విధంగా ఉండడంతో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలావుండగా గట్టు దవాఖానాకు రంగులు వేయించే పనులు కొనసాగుతున్నాయి. రెండు, మూడు రోజుల్లో ఈ పను లు పూర్తికానున్నాయి. మిగులు నిధులను ఆసుపత్రిలో వసతుల కల్పనకు వినియోగించనున్నారు. మొత్తంమీద జిల్లాలు ప్రజలకు దగ్గరకావడంతోపాటు ఉన్నతాధికారులు కూడ అందుబాటులోనే ఉండడంతో మండలాలల్లోని దవాఖానలు రోగులను ఆకర్షించే విధంగా మారడంతోపాటు మెరుగైన చికిత్సలు అందనున్నాయనే ఆనందం ప్రజల్లో వ్యక్తమవుతోంది.

డీఎంఅండ్‌హెచ్‌వో ఏమంటున్నారంటే..


ఈ విషయాన్ని డీఎంఅండ్‌హెచ్‌వో కృష్ణ వద్ద ప్రస్తావించగా..పీహెచ్‌సీలకు ఎంపిక చేసిన రంగులు వేయించమని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయని తెలిపారు. అన్ని పీహెచ్‌సీల్లో ఎంపిక చేసిన రంగులు వేయించాలని చెప్పాం. హెచ్‌డీఎస్ నిధులతో రంగులు వేయించాలని పీహెచ్‌సీలకు ఆదేశాలు ఇచ్చాం. మిగిలిన నిధులను ఆసుపత్రిలో సౌకర్యాల కల్పనకు వెచ్చించాలని స్పష్టం చేశాం.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS