ఎంఏఎల్‌డీ కళాశాలలో జాతీయ సెమినార్


Wed,January 11, 2017 02:28 AM

గద్వాలటౌన్: మహారాణి ఆదిలక్ష్మీ దేవమ్మ డిగ్రీ కళాశాలలో ఫిబ్రవరి 8 నుంచి 10 వరకు రాష్ట్ర, జాతీయ స్థాయిలో సెమినార్లు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ గంగాధర్ తెలిపారు. కళాశాలలో తన కార్యాలయంలో మంగళవారం సెమినార్‌కు సంబంధించిన బ్రోచర్లను లెక్చరర్స్‌తో కలసి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల ఆత్మహత్యల నివారణ, భవిష్యత్తు ప్రణాళికల తదతర అంశాలపై సెమినార్ హాల్‌లో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ రీసర్చ్ (ఐసీఎస్‌ఎస్‌ఆర్)ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే బాలకార్మికులపై తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (టీఎస్‌సీహెచ్‌ఈ)ఆధ్వర్యంలో సెమినార్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

సెమినార్లకు బెంగుళూర్ యూనివర్సిటీ, బళ్ళారి, మద్రాస్, శ్రీ కృష్ణదేవరాయ, ఉస్మానియా, కాకతీయ, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, పూనే యూనివర్సిటీల నుండి ఫ్రొఫెసర్లు హాజరు కానున్నట్లు తెలిపారు. రెండు వేల మంది విద్యార్థులు సెమినార్‌కు హాజరవుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ రుక్మిణి, లెక్చరర్స్ లక్ష్మిప్రసాద్, కృష్ణమూర్తి, శివనారాయణ, పీడీ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS