రామాలయ పూర్వవైభవానికి శ్రీకారం


Wed,January 11, 2017 02:28 AM


గద్వాలటౌన్ : ఎట్టకేలకు మంత్రాలయ పీఠాధిపతలు స్పందించారు. ఇచ్చిన హామీ మేరకు కోటలోని రామాలయ ఆలయానికి పునర్జీవం పోసేందుకు శ్రీకా రం చుట్టారు. అందుకు గాను మంగళవారం భూమి పూజ చేశారు. ఆలయానికి పూర్వవైభవం తెచ్చేందుకు పీఠాధిపతులు తీసుకున్న నిర్ణయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఆలయ విశిష్టత..


కోటలోని భూలక్ష్మీ చెన్నకేశవ ఆలయ సముదాయం లో రామాలయం ప్రధానమైనది. రామాలయం శిల్పకళకు పెట్టింది పేరు. రామాలయంలో జీవకళ, శిల్పాలలోని మృదత్వం ఎక్కడా కనిపించదనేది పరిశోధకు లు నిర్ధారించిన నిజం. అలాగే ఆలయంలో రాము డు, సీతాదేవి లక్ష్మణుడి విగ్రహాలు దేవాతమూర్తులు కొలువుదీరిన విధంగా ఉండేవని చరిత్రకారులు చెప్తున్నారు. అలాగే ఆలయంలో ఉన్న ఏకశిల స్తంభాలు వాటిపై ఉన్న కళ చూపరులను కట్టిపడేస్తుంది.

వాగ్ధానానికి శ్రీకారం..


కోటలోని భూలక్ష్మీ చెన్నకేశవ ఆలయంతో పాటు శ్రీ రాముడు, వేణుగోపాలస్వామి ఆలయాల అభివృద్ధి కూడ మంత్రాలయ పీఠాధిపతులపై ఉంది. కాని గత 8ఏళ్లు బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయాల అభివృద్ధిని త్వరలోనే చేపడతామని పీఠాధిపతులు చెప్తూ వచ్చారు. కాని గత ఏడాది పీఠాధిపతి వచ్చే బ్రహ్మోత్సవాలకు ఆలయాల అభివృద్ధికి ఖచ్చితంగా శ్రీకారం చుడతామని హమీ ఇచ్చారు. ఆ మేరకు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అయితే ఆలయ అభివృద్ధి పనులు పూర్తవడానికి కొంత కాలం పడుతుందని ఆల య మేనేజర్ తెలిపారు. ఆలయంపై కొత్తగా గోపుర నిర్మాణంతో పాటు చుట్టూ గోడలను నిర్మాణం చేపట్టాలన్నారు. అలాగే ఆలయంలోని శిల్పకళను కూడ తీర్చిదిద్దాల్సి ఉందని తెలిపారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS